Peddapuram : పెద్దాపురం పెద్దరాయుడు మళ్ళీ రాజప్పే...!
peddapuram : ఉభయగోదావరి జిల్లాలో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న బ్యాడ్ ఇమేజ్ ను ఇప్పుడు పూర్తిగా మార్చేసుకున్న పెద్దాపురం…. ఇప్పుడు వివిధ రంగాల్లో ముందంజలో ఉంది. రాజకీయవంతమైన ఎంతో చైతన్యవంతమైన ప్రజలు ఉండే నియోజకవర్గం మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప అనూహ్యంగా రెండుసార్లు గెలిచారు. ఇక ఇప్పుడు మూడోసారి గెలిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ఆయనకు జనసేనతో పొత్తు కలిసి వస్తుంది అని చెప్పాలి. అలాగే టిడిపి పార్టీ కి వీర విధేయుడుగా ఉండే రాజప్పకు అన్ని మంచి శకునాలే అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. ఇక ఇక్కడ వైసిపి తన అభ్యర్థుల విషయంలో కింద మీద పడుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం టిడిపి ఏర్పడిన తర్వాత ఆ పార్టీ కి కంచుకోటగా మారింది. టిడిపి ఆరుసార్లు గెలిచింది. పిఆర్పి ఒకసారి గెలిచింది. ప్రస్తుతం నిమ్మకాయల రాజప్ప రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. 2019లో జగన్ వేడిని తట్టుకొని విజయం సాధించారు చినరాజప్ప.
మున్సిపల్ ఎన్నికల వైసిపి బలం పంచుకుని పెద్దాపురం సామన్న కోట మున్సిపాలిటీ కైవాసం చేసుకున్న టిడిపి కూటమి నుంచి నిమ్మకాయల చిన్న రాజప్ప అభ్యత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. వైసిపి తరఫున ఇంచార్జిగా దళవూరి దొరబాబు ఉన్నారు. ఆయన కన్నా బలమైన నేత ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇద్దామని జగన్ చూస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఉద్రపాటి పద్మనామ కుటుంబ సభ్యుల పేర్లు బాగా వినిపించాయి. కానీ ఇప్పుడు ముద్రగణకు వైసిపి పార్టీతో కూడా చెడింది. ఈ క్రమంలోనే దొరబాబుకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దాపురం నియోజకవర్గం కాపు నియోజకవర్గం అనుకోవచ్చు . ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో టిడిపి పార్టీకి 41% ఓట్లు రాగా వైసిపి పార్టీకి 39% ఓట్ల లభించాయిం. అయితే జనసేన పార్టీ అభ్యర్థి ఏకంగా 16% ఓట్లను చీల్చారు.అయినా కూడా టిడిపి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించాడు.ఇక 2019 ఎన్నికలకు ముందు కాకినాడ నుండి టిడిపి ఎంపీగా ఉన్న తోట నరసింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వానికి పెద్దాపురం టికెట్ ఇవ్వాల్సిందిగా టిడిపి అధిష్టానాన్ని కోరడం జరిగింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న చినరాజప్పను కదిలించడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. దీంతో తోట నరసింహం కుటుంబం వైసిపి పార్టీలో చేరిపోయింది. ఇక వీరంతా కలిసి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన వాణి ను బరిలోకి దింపారు.
ఇక ఈ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోవడం జరిగింది. అయితే అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకుని ప్రజలు మళ్ళీ రాజప్పకే అవకాశం ఇచ్చారు. అయితే నిమ్మకాయల చినరాజప్ప అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. అవినీతి మరక అసలు అంటని నాయకుడు. కష్టమని వచ్చిన వారిని కచ్చితంగా ఆదుకుంటాడు. తన పార్టీ పట్ల విధేయతను కలిగి ఉంటాడు. అలాగే తన ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. ఇక చిన్న రాజప్పకు ఉన్న ఈ పాజిటివ్ ఇమేజ్ మరోసారి ఆయనకి అధికారం దక్కేలా చేస్తుందని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం పెదరాయుడు మళ్ళీ రాజప్ప అవుతాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.