Union Budget 2024 : 47.66 లక్షల కోట్ల బడ్జెట్.. వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు ఇలా..!

Union Budget 2024  : Finance Minister Nirmala Sitharaman కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనూ బడ్జెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్ సభకు ఇదే చివరి బడ్జెట్ అయినందువలన ఎలాంటి ప్రకటనలు వెలువబడుతాయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యంతరం బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థ తో పాటు ఎన్నికల పరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలో ఉండవచ్చని అంచనా. మరో 70 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా వచ్చిన మధ్యంతర బడ్జెట్ ఇది. ఇందులో కొత్త పథకాలు కొత్త హామీలు ఉండవు కానీ ఆల్రెడీ కొనసాగుతున్న పథకాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని అంచనా.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో వివిధ శాఖలు పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం 47.66 లక్షల కోట్లు కాగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం 30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గత పది ఏళ్లలో ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది అని అన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె వివరించారు.

Union Budget 2024 బడ్జెట్లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు ఇలా

• రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు
• రైల్వే శాఖకు 2.5 లక్షల కోట్లు
• మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్లు
• గ్రామీణాభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు
•వ్యవసాయం రైతుల సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు
• హోం శాఖకు 2.03 లక్షల కోట్లు
• రసాయనాలు ఎరువుల కోసం 1.68 లక్షల కోట్లు
• ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు 2.13 లక్షల కోట్లు
• ఉపరితల రవాణా జాతీయ రహదారుల నిర్మాణానికి 2.78 లక్షల కోట్లు
• ఆయుష్మాన్ భారత్ పథకానికి 7,500 కోట్లు
• గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86 వేల కోట్లు
• కమ్యూనికేషన్ రంగానికి 1.37 లక్షల కోట్లు
• పారిశ్రామిక ప్రోత్సాహాలకు 6,200 కోట్లు
• సెమీ కండక్టర్లు డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 693 కోట్లు
• సోలార్ విద్యుత్ గ్రిడ్ కు 8500 కోట్లు
• గ్రీన్ హైడ్రోజన్ కు 600 కోట్లు

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago