
One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్లలోనే ఏపీలో ఎన్నికలా..?
One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ.. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి కోరనున్నారు.
One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్లలోనే ఏపీలో ఎన్నికలా..?
ఎజెండాను లోక్‌సభలో వెల్లడించిన తర్వాత ఈ బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకోనున్నారు. ఈ బిల్లును జేపీసీకి సమర్పించడం, వివరణాత్మక చర్చ, ఏకాభిప్రాయం కోసం పంపబడుతుంది. రేపు జేపీసీ ఏర్పాటు చేస్తామని, అందులో బీజేపీ-కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల సభ్యుల పేర్లను కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ బిల్లును ఇంకా ఎజెండాలో చేర్చలేదు. కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా విప్‌ను జారీ చేయాలంటూ బీజేపీ ఆదేశించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, శివసేన మూడంచెల విప్‌ను ఇచ్చాయి.
జమిలి ఎన్నికలతో పాటు గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 సభ ముందుకు వస్తాయి. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 12న కేంద్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పక్కనబెట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను ఆమోదించింది. నేటి సభా కార్యకలాపాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందంటూ తమ ఎంపీలకు సూచించింది బీజేపి.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.