One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

 Authored By ramu | The Telugu News | Updated on :17 December 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ.. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి కోరనున్నారు.

One Nation One Election టీడీపీ విప్ జారీ రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా

One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

One Nation One Election అంతా స‌స్పెన్స్..

ఎజెండాను లోక్‌సభలో వెల్లడించిన తర్వాత ఈ బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకోనున్నారు. ఈ బిల్లును జేపీసీకి సమర్పించడం, వివరణాత్మక చర్చ, ఏకాభిప్రాయం కోసం పంపబడుతుంది. రేపు జేపీసీ ఏర్పాటు చేస్తామని, అందులో బీజేపీ-కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల సభ్యుల పేర్లను కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ బిల్లును ఇంకా ఎజెండాలో చేర్చలేదు. కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా విప్‌ను జారీ చేయాలంటూ బీజేపీ ఆదేశించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, శివసేన మూడంచెల విప్‌ను ఇచ్చాయి.

జమిలి ఎన్నికలతో పాటు గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 సభ ముందుకు వస్తాయి. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 12న కేంద్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పక్కనబెట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను ఆమోదించింది. నేటి సభా కార్యకలాపాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందంటూ తమ ఎంపీలకు సూచించింది బీజేపి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది