Pawan Kalyan : టీడీపీ, జనసేన పార్టీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్? ఇది ఫిక్స్?

Advertisement

Pawan Kalyan : అమ్మ.. నువ్వు ఏం బాధపడకు. ఆనాడు నిన్ను శాసనసభ సాక్షిగా అవమానించారు. అదే శాసనసభ సాక్షిగా నీ ముఖంలో నవ్వు తెప్పించే బాధ్యత నాది. మేం కలిసికట్టుగా పోరాటం చేస్తాం.. అంటూ నారా భువనేశ్వరికి భరోసా ఇచ్చింది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తాం అని చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. బాలకృష్ణతో కలిసి చంద్రబాబును పరామర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు.

Advertisement

అయితే.. సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కాలేదు. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ తరుపున సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ముందు పెడితే విజయం దక్కుతుందా? అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఏపీలో భారీగానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ ను ముందు పెట్టి టీడీపీ, జనసేన కూటమి పని చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
pawan kalyan as cm candidate for tdp and janasena party alliance
pawan kalyan as cm candidate for tdp and janasena party alliance

Pawan Kalyan : జగన్ ను కొట్టాలంటే పవన్ కే సాధ్యం అవుతుందా?

ప్రస్తుతం చంద్రబాబు జగన్ ను ఢీకొట్టే పరిస్థితుల్లో లేరు. టీడీపీలో అంత పవర్ ఫుల్ నాయకులు కూడా లేరు. నారా లోకేష్ పేరుకే కానీ.. అంతగా ఆయన రాజకీయాలు చేయలేరు. ఇక టీడీపీలో ఉన్న పవర్ ఫుల్ నేతలు ఎవరు అంటే చెప్పడం కష్టం. ప్రస్తుతం జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది అంటే కాస్తో కూస్తో పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. అందుకే.. జగన్ దూకుడుకు కళ్లెం వేయగలిగే శక్తి కేవలం పవన్ కు మాత్రమే ఉందని ఏపీ ప్రజలే కాదు.. టీడీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. అందుకే జనసేన, టీడీపీ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఇది ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?

Advertisement
Advertisement