Pawan Kalyan VS Ali : అలీని ఇంత దారుణంగా ఎవ్వరూ తిట్టి ఉండరు.. బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా అలీపై పవన్ రెచ్చిపోయాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan VS Ali : అలీని ఇంత దారుణంగా ఎవ్వరూ తిట్టి ఉండరు.. బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా అలీపై పవన్ రెచ్చిపోయాడు

 Authored By kranthi | The Telugu News | Updated on :2 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  నాతో ఉండేవాళ్లు ఉండొచ్చు.. పోయే వాళ్లు పోవచ్చు

  •  ఇక్కడ ఉండే బదులు వైసీపీలో చేరండి

  •  మీరంతా వైసీపీ కోవర్టులే

Pawan Kalyan VS Ali : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే.. అలీ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కమెడియన్ మాత్రమే కాదు.. వైసీపీ నేతగానూ ఆయన ఇప్పుడు ఉన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్, అలీ ఇద్దరి మధ్య బంధం మామూలుగా ఉండదు. వాళ్లు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ.. రాజకీయాల్లో వాళ్లు బద్ధ శత్రువులుగా మారారు. అంతే కాదు.. అలీ వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి కూడా తాను సిద్ధం అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో జరిగిన మీటింగ్ లో ప్రస్తావించారు. అలీపై ఇన్ డైరెక్ట్ గా విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. నన్ను జేపీ నడ్డా అర్థం చేసుకున్నారు. అమిత్ షా అర్థం చేసుకున్నారు. సీనియర్ పొలిటికల్ లీడర్ చంద్రబాబు నన్ను అర్థం చేసుకున్నారు. కానీ.. నేను పెంచి నేను అండగా ఉన్న నాయకులు మాత్రం నన్ను అర్థం చేసుకోరు. నేను అర్థం కావడం లేదు. ఎక్కడ ఉంది లోపం. నేషనల్ లేవల్ లో నాకు ఉన్న విజన్ మోదీకి అర్థం అయింది. మోదీ లాంటి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటే.. మిడిమిడిగా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు. నా పక్కన ఉండటం కంటే కూడా, మన పార్టీలో ఉండటం కంటే కూడా సంతోషంగా మిగితా నాయకులు వెళ్లిపోయినట్టు వైసీపీలోకి వెళ్లిపోండి అంటూ మండిపడ్డారు.

మనవాళ్లే మన వాళ్లను పొడిస్తే కష్టం. అలాంటి వాళ్లను నేను చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటా. ఏపీ భవిష్యత్తు కోసం నేను చాలా మొండిగా వ్యవహరిస్తా. నేను ఒక భావజాలాన్ని నమ్మాను అంటే.. దానికే కట్టుబడి ఉంటాను. నన్ను ఎవ్వరూ బతిమిలాడలేదు. నేను ఎవ్వరినీ బతిమిలాడను. నేను ఎవ్వరి ఆశ్రయం తీసుకోలేదు. నన్ను చాలా మంది మోసం చేశారు. ఎవరూ ఎవరిని రాజకీయాల్లో బతిమిలాడరు. నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే.. మీరు కూడా చేయండి. నాయకుడిగా ఉండటం అనేది అంత ఈజీ కాదు. బాధ్యత తీసుకోవడం అనేది ముఖ్యం. నా నిర్ణయాలను మీరు సందేహిస్తున్నారు. సంతోషంగా వాళ్లంతా వైసీపీలోకి వెళ్లిపోవచ్చు. జనసేన, టీడీపీ పొత్తు గురించి ఎవరు మాట్లాడినా వాళ్లందరినీ వైసీపీ కోవర్టులుగానే చూస్తాను. యుద్ధం మొదలు పెడుతున్నాం. ఇప్పటి దాకా నడిపింది వేరు.. జగన్ మాట్లాడితే కురుక్షేత్రం అంటున్నాడు. ఆయనేదో అర్జునుడు అనుకుంటున్నాడు. నువ్వు లక్ష కోట్లు దొబ్బేసి రాజకీయ నాయకుడివి అయ్యావు. నీ దోపిడిని మేము అడ్డుకోవాలని అనుకుంటున్నాం. అంతే కానీ.. నువ్వు అర్జునుడు, భీముడు, ధర్మరాజుతో పోల్చుకోకు. వాళ్లు మహానుభావులు.. అంటూ మండిపడ్డారు పవన్.

Pawan Kalyan VS Ali : పింగిళి వెంకయ్య గారు ఆకలితో చనిపోయారు

ఒక దోపిడి వ్యవస్థను నిలువరించడానికి చేస్తున్న యుద్ధం తప్పితే దీంట్లో కూర్చోబెట్టి చేసేదేం లేదు. నేను ఈ వంద రోజుల్లో మనం ఇంకెంత కొట్లాడాలి. ఇంకెంత పోరాటం చేయాలి అనేది చూడాలి. పింగిళి వెంకయ్య గారి పుస్తకం చదివాను నేను. ఆయన చివరికి ఆకలితో చనిపోయారు. వాళ్లు అన్ సంగ్ హీరోస్. బాధ్యతతో ముందుకెళ్లాలి. జనాలు.. ఎన్నికలు..  ఇవన్నీ కూడా ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ స్టెబిలిటీ కోసమే. కేంద్రం, బీజేపీ మనకు అండగా ఉంటుంది. మోదీ మనకు అండగా ఉంటారు. మనకు 70 శాతం మద్దతు వచ్చినా చాలు. అలాగని మనకు గొడవలు వద్దు. 30 శాతం ఏకీభవించకున్నా మనం ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకుందాం.. అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇన్ డైరెక్ట్ గా అలీ తనకు సపోర్ట్ చేయకున్నా.. తను నమ్మిన వ్యక్తి ముంచినా కూడా పట్టించుకోను అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది