Pawan Kalyan : చిన్మయ్ కృష్ణ దాస్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : చిన్మయ్ కృష్ణ దాస్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత గురువు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే అధికార ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను ఇటీవల బంగ్లాదేశ్‌లో నిర్బంధించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ఆయన స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం తమ రక్తాన్ని చిందించిందని చెప్పారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మయ్ కృష్ణ దాస్‌ని బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ అందరం కలిసికట్టుగా ఉందామన్నారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని మంగళవారం ఉదయం 11 గంటలకు చిట్టగాంగ్ ఆరవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కాజీ షరీఫుల్ ఇస్లాం ముందు హాజరు పరిచారు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం అతడిని జైలుకు పంపాలని ఆదేశించింది. చిన్మయ్ కృష్ణ దాస్‌పై దేశద్రోహ నేరం కింద కేసు నమోదైంది.
ఇదిలా ఉండగా మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టుపై స్పందిస్తూ హిందువుల భద్రతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా దేశంలో ‘మత సామరస్యాన్ని’ నిలబెట్టడానికి ప్రభుత్వం దృఢంగా ఉందని పేర్కొంది. Pawan Kalyan condems detention of Chinmoy Krishna Das in Bangladesh , Andhra Deputy CM, Pawan Kalyan, Chinmoy Krishna Das, Bangladesh