Pawan kalyan : ఆ రెండు నియోజకవర్గాల పై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఆ రెండు సీట్లు మాకే కావాలంటూ డిమాండ్ ..!

Advertisement
Advertisement

Pawan kalyan : ఏపీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. మళ్లీ అధికారంలోకి రావాలని వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు పై దృష్టి పట్టాయి. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్న రెండు నగరాల్లోని నియోజకవర్గాలపై కన్నేసినట్టు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలు ఏంటంటే గుంటూరు పశ్చిమం, విజయవాడలో ఒక సీటు అని తెలిసింది. విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విజయవాడ సెంట్రల్ పశ్చిమంలో వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ఉన్నారు. వీటిల్లో తూర్పు నియోజకవర్గాన్ని వదిలేస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లేదా పశ్చిమంలో కచ్చితంగా జనసేన గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారట.

Advertisement

అయితే సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడి నుండి జనసేనకు టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా టికెట్ దొరకడం అనుమానమే. అయితే ఏవో కారణాలు చెప్పి రెండు నియోజకవర్గాల్లో టికెట్లు కుదరదని టీడీపీ అంటే పవన్ కూడా మాకు కుదరదని ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

మూడు సీట్లలో కచ్చితంగా ఒక సీటు ఇచ్చి తీరాల్సిందే అని పవన్ చెప్పారట. దీంతో టీడీపీకి ఏ నియోజకవర్గంలో కోతపడుతుందో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా గుంటూరులోని రెండు తూర్పు పశ్చిమ నియోజకవర్గం కచ్చితంగా ఒక దానిలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారట. గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ తో ప్రత్యేకంగా పవన్ భేటీ అయ్యారు. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సామాజిక వర్గాలు పార్టీల బలబలాలు జనాల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించి రిపోర్ట్లు తెప్పించుకున్నారు. కాబట్టి ఆ రిపోర్టులను దగ్గర పెట్టుకుని స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీ చేసే నియోజకవర్గాలను పవన్ అడుగుతున్నారు. దానికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Recent Posts

Nagarjuna : ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించిన నాగార్జున‌… పృథ్వీ, విష్ణు ప్రియ‌ల‌కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడుగా..!

Nagarjuna : ప్ర‌తి శ‌నివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8  వేదిక‌పైకి వ‌చ్చి తెగ సంద‌డి…

37 mins ago

Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??

Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…

2 hours ago

Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !

Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…

3 hours ago

Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?

Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…

4 hours ago

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…

5 hours ago

Telangana Pharma Jobs : తెలంగాణలో ఫార్మా కంపెనీల 5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాల కల్పన

Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…

6 hours ago

Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…

7 hours ago

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

16 hours ago

This website uses cookies.