Pawan kalyan : పదేళ్ల కళ.. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం..!
ప్రధానాంశాలు:
Pawan kalyan : పదేళ్ల కళ.. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం..!
Pawan kalyan : పదేళ్లుగా రాజకీయాలలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికలలో తను గెలవడమే కాకుండా తన పార్టీ నాయకులని కూడా గెలిపించాడు. ఇక ఆయన డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలు కూడా అందుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అయితే పవన్ ఇక్కడ కూడా సింప్లిసిటీ కనిపించింది.. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్‌పై సంతకాలను తన అభిమాని ఇచ్చిన పెన్నుతో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమాని ఇచ్చిన పెన్నుని అంత జాగ్రత్తగా ఉంచుకొని దానితోనే తొలి సంతకం చేయడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు.
Pawan kalyan సింహం సింగిల్‌గా..
జగన్‌ను అథ: పాతాళానికి తొక్కేస్తానని చెప్పిన పవన్ తన వ్యూహాలతో బీజేపీ, టీడీపీలతో జతకట్టి.. వాడి వేడి ప్రసంగాలతో ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించారు. ఈసారి రెండు స్థానాల నుంచి కాకుండా పిఠాపురం నుంచి బరిలో నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే సాబ్‌గా సగర్వంగా అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ అపురూప క్షణాలను టీవీలలోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వీక్షించిన అశేష అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’.. అంటూ ఆయన తెలుగులో ప్రమాణపత్రాన్ని చదివారు. దైవసాక్షిగా శాసనసభ నియమాలను పాటిస్తానని, శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని, సౌర్వభౌమాధికారాన్ని కాపాడతానని, తన బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ప్రమాణం చేశారు.
ప్రమాణం పూర్తయ్యాక ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి.. కిందకు దిగి వచ్చి రిజిస్టర్ లో సంతకం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.వైసీపీ నేతలు తమ జనసేనానిని అసెంబ్లీకి అడుగుపెడ్డనీయబోమంటూ ప్రగల్భాలు పలికారు. కాని పవన్ కళ్యాణ్.. సింహంలాగా గేట్లు బద్దలుకొట్టుకుని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు. నాగబాబు సైతం సింహం అసెంబ్లీ గేట్లను తోసుకుని అరుచుకుంటూ వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.