Pawan kalyan : ఢిల్లీకి వెళ్లిన జనసేనాని…బిజెపితో పొత్తు కుదిరేనా…?
ప్రధానాంశాలు:
Pawan kalyan : ఢిల్లీకి వెళ్లిన జనసేనాని...బిజెపితో పొత్తు కుదిరేనా...?
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ఉంటాయా పుట్టుకుమంటాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు మరియు ఆయన కొడుకు నారా లోకేష్ ఏకపక్ష దోరణలపై దిక్కర స్వరం వినిపించి తన పార్టీ తరఫున రెండు సీట్లను ప్రకటించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదురుచుకునేందుకు కమలదళం కూడా వస్తుందా…? చంద్రబాబు పల్లకి మోయడానికి తనతో పాటుగా మోడీ కూడా సిద్ధంగా ఉన్నారా అని తెలుసుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
అయితే చంద్రబాబు నాయుడు అరకు మరియు మండపేట సీట్లను ప్రకటించేశారు. అందుకుగాను పోటీగా తన మీద ఒత్తిడి తెస్తున్న పార్టీ కార్యకర్తల సంతృప్తి కోసం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రెండు సీట్లను ప్రకటించి ఉండవచ్చు అని తెలుస్తుంది. కానీ వీటన్నిటి వెనుక అసలు కారణం మాత్రం ఒకటే అంటున్నారు కొందరు. అదేంటంటే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఇంకా తేలేకపోవడం…మరోవైపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రమంతా తన పార్టీ నియోజకవర్గ అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులు వారి నియోజకవర్గాలలో పార్టీ కార్యాలయాలను కూడా ఓపెన్ చేసి ప్రచారాలు చేస్తున్నారు. ఈ రకంగా అధికార పార్టీ అన్ని విధాలుగా ముందంజలో ఉంది. ఇక ఇటువైపు ఒక జట్టులో రెండు పార్టీలు ఉంటే…ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే వారు తేల్చుకోకపోవడానికి ప్రధాన కారణం బిజెపి నిర్ణయం రాకపోవడం అని చెప్పాలి.
ఎందుకంటే బిజెపిని కూడా జట్టులో కలుపుకుని జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పక్కకు మరలకుండా జగన్ ను గద్దేదించే పనిలో కూటమి ఆలోచన చేస్తుంది. అందుకే కూటమి లోని పనులు సరిగా ముందుకు సాగడం లేదు. నీతో ఏ సంగతి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లుగా సమాచారం. మరి బిజెపి పార్టీ కూటమిలోకి వస్తుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.మరి నిర్ణయాన్ని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఏం సాధించుకొని వస్తారో వేచి చూడాలి.