Pawan Kalyan : పవన్ ఏదైన వ్యూహంతో వెళుతున్నారా.. ఆయన భజన వెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి ?
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ ఏదైన వ్యూహంతో వెళుతున్నారా.. ఆయన భజన వెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి ?
Pawan Kalyan : ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆయన చేసే పనులు, వేసే అడుగులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పవన్ టెంపరరీ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన ఎక్కువగా రాష్ట్ర సమస్యలపైనే దృష్టి పెట్టారు. మధ్యలో సనాతన ధర్మమంటూ తిరుమల లడ్డూ వివాదంలో తలదూర్చినప్పటికీ ఎక్కువ సమయం మాత్రం ఆయన పాలనపైనే ఫోకస్ పెట్టారు. తనకు ఇష్టమైన గ్రామీణ, పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖను ఎంచుకుని మరీ తీసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ గ్రామ స్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టేశారు.
Pawan Kalyan ఏదైన స్కెచ్ ఉందా..
పట్టణ ప్రాంతాల్లో ఎటూ కాపు సామాజికవర్గంతో పాటు, సినీ అభిమానులుంటారు. వారు ఎటూ వెళ్లరు. తనకు అండగా నిలుస్తారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తనను ఆదరించేందుకు పట్టణ ప్రాంతంలో వారు రెడీగా ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో పట్టు తక్కువ. అందుకే ఆయన గ్రామాలపై పట్టుసంపాదించుకోవడానికి వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతూ పవన్ వచ్చిన తర్వాతనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్న సంకేతాలను తీసుకెళుతున్నారు. అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 20 వరకు పల్లె పండుగ వారోత్సవాలను చేయాలని నిర్ణయించారు. పల్లెల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నదే పవన్ ఆలోచనగా ఉందని తెలిసింది. భవిష్యత్ లో ఇది తన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ ఏదైన వ్యూహంతో వెళుతున్నారా.. ఆయన భజన వెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి ?
అయితే పవన్ ఈ మధ్య ఏ సభలో అయిన చంద్రబాబు, మోడీ గురించే ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఇది కొందరికి మింగుడుపడడం లేదు. పవన్ చుట్టూ రక్షణ వలయంగా అభిమాన గణం ఉందని చెప్పుకున్నాం కదా అలాగే ఆయన మీదనే ఆశల మోసులు పెట్టుకుని ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. ఎపుడూ ఆ రెండు పార్టీలేనా అంటూ తమ వారూ అందలం ఎక్కాలని ఆ వర్గం ఆశగా చూస్తోంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ తరఫున యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనుభవానికి 16 ఏళ్ళు అచ్చంగా నిండాయి. రాజకీయాలోనే కాదు ఏ రంగంలోనూ ఎవరూ పరిపూర్ణుడు కాదు, నిత్య విద్యార్ధులే. జనసేన సూపర్ హిట్ కావాలి పవన్ సీఎం కావాలి అన్నది కోట్ల మంది కోరికగా ఉన్న వేళ ఆ దిశగా తన పార్టీని మరింతగా పటిష్టం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుంది . అయితే పవన్ భజన వెనక ఏదైన వ్యూహం ఉందా అనేది ఆయనకే తెలియాలి.