Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  2029 ఎన్నికల్లో జగన్ ఎలా గెలుస్తాడో చూస్తా... వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్

  •  మీకు ఎవడ్రా భయపడేది ..వైసీపీ కి OG వార్నింగ్

  •  Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..!

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప ముఖ్యమంత్రి Pawan Kalan పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయపెట్టడం, రౌడీయిజం, గూండాయిజంతో పాలించడం వల్లే వైసీపీకి ప్రజలు బుద్దిచెప్పారని వ్యాఖ్యానించారు. “2029లో అధికారంలోకి వస్తే మిమ్మల్ని వదలము” అని వైసీపీ నేతలు అంటున్నారని పేర్కొన్న పవన్, “ముందు అధికారంలోకి రావాలి కదా? ఎలా వస్తారో చూద్దాం” అంటూ ఘాటుగా స్పందించారు.

Pawan Kalyan 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ వీడియో

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : 2029 లోను మాదే విజయం.. మార్కాపురం అడ్డాపై పవన్ కీలక వ్యాఖ్యలు

తాను సినిమాల నుంచి వచ్చినవాడినే కానీ, సినిమా డైలాగులు చెప్పడం తన స్వభావం కాదని, ప్రజల కోసం నిజమైన రాజకీయ సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై తనకెంతో వ్యక్తిగత అనుబంధం ఉందని, చిన్నప్పుడు కనిగిరిలో కొన్ని నెలలు నివసించిన సమయంలో ఫ్లోరైడ్ సమస్య తాలూకు భయానక అనుభవం తనకు మిగిలిందని వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ఈ తాగునీటి ప్రాజెక్టు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లాలో జరిగిన అతిపెద్ద అభివృద్ధి పథకంగా పేర్కొన్నారు. 18 మండలాల్లో 572 గ్రామాలకు ఈ పథకం ద్వారా మంచినీరు అందిస్తామని, 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పవన్ ఆరోపించారు. కేంద్రం 26,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినా, వైసీపీ కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి వాటిని వృథా చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడానికి ఆ కారణమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వంగా తామే నిధులు తీసుకొచ్చామని, ప్రత్యేకంగా ఎంపీల విజయంతో కేంద్రానికి “ఆక్సిజన్” ఇచ్చామని తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన పవన్, వైసీపీ హయాంలో వీటిని దోచిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి అంటే పిడికిలిలాంటిది అని, అందరూ కలసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 15 సంవత్సరాలపాటు కూటమిని నిలబెడితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది