Pawan Kalyan : చంద్రబాబును కలిసిన పవన్.. బాబు చెప్పిన ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి
ప్రధానాంశాలు:
టీడీపీ అధినేతతో జనసేనాని భేటీ
జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తొలిసారి చంద్రబాబుతో పవన్ భేటీ
టీడీపీ, జనసేన పొత్తు గురించి చర్చ
Pawan Kalyan : పలు అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు 4 వారాల పాటు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలు నుంచి విడుదల చేశారు. ఆయన్ను విడుదల చేయగానే వెంటనే హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు, పలువురు శ్రేయోభిలాషులు, నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటికి క్యూ కట్టారు. తాజాగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ లోని తన నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలిసారి స్పందించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ స్పందించడమే కాదు.. జైలు లోపలికి వెళ్లి బాబును పరామర్శించి తనకు ధైర్యం చెప్పారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని మరీ జనసేన పోటీ చేస్తుందని రాజమండ్రి జైలు దగ్గరే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయన్నమాట.
మరోవైపు చంద్రబాబు రిలీజ్ కాగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన చంద్రబాబు ఇంటికి బయలుదేరి వెళ్లారు. అక్కడ మర్యాదపూర్వకంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ తన ఇంటికి రాగానే మర్యాద పూర్వకంగా చంద్రబాబు ఇంటి ముందుకు వెళ్లి మరీ స్వాగతం పలికారు. ఆ తర్వాత పుష్పగుచ్చం ఇచ్చారు. ఇద్దరూ కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పొత్తుల గురించి మాట్లాడుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పుడు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తనకు అన్నివేళలా మద్దతు ఇచ్చిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan : పొత్తు కంటిన్యూ అవుతుందా?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే విషయంపై చంద్రబాబు, పవన్ ఇద్దరూ చర్చించారు. చాలాసేపు ఇద్దరు నేతలు చర్చించారు. అలాగే.. చంద్రబాబుపై ఉన్న కేసుల విషయంపై కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏది ఏమైనా తనకు, తన పార్టీకి, తన కుటుంబ సభ్యులకు మోరల్ సపోర్ట్ ఇచ్చి మద్దతుగా నిలిచినందుకు చంద్రబాబు.. పవన్ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.