Pawan Kalyan : మంత్రి పదవి వద్దనుకుంటున్న పవన్ కళ్యాణ్.. కారణం ఇదేనా..?
ప్రధానాంశాలు:
Pawan Kalyan : మంత్రి పదవి వద్దనుకుంటున్న పవన్ కళ్యాణ్.. కారణం ఇదేనా..?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న విషయం తెలిసిందే.గత ప్రభుత్వాన్ని చిత్తు చిత్తు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించింది. ఇక జూన్ 9న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అదే రోజున కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. .కొత్త క్యాబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక పదవులు దక్కబోతున్నాయనే హడావుడి జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం దక్కబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Pawan Kalyan మంత్రి పదవి వద్దట..
దీంతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నుంచి మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి.ఒకప్పుడు రెండుచోట్ల ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని.. అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. అందరూ ఊహించినట్లే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తోంది. ఐతే.. జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని అభిమానులు కోరుకున్నారు. చాలా సందర్భాల్లో పవన్ సభల్లో కూడా వారు సీఎం, సీఎం అని నినదించారు. ఇలా అన్న ప్రతిసారీ.. ముందు ఓటు వెయ్యండి తర్వాత చూద్దామని పవన్ ఖండిస్తూ వచ్చారు. ఈసారి ఏకంగా 21 సీట్లు సాధించారు కాబట్టి.. పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ.. ఆ అవకాశం కనిపించట్లేదు.
పవన్ కళ్యాణ్ తనకి మంత్రి వద్దని అని చెబుతున్నారట. తన స్థానంలో మరొక నాయకుడికి… మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారట. కేవలం తాను జనసేన అధినేతగా ఉండి… ఏపీ ప్రభుత్వానికి సలహాలిస్తూ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. జనసేన నుంచి కనీసం ఆరుగురు మంత్రులు ఉండేలా స్కెచ్ వేస్తున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకోసమే తాను తప్పుకొని… కేవలం పార్టీ బాధ్యతలు చూసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ తాను కమిటైన సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి కోసం ఏడాది పైన పడుతుంది. ఆ లోపు చిత్ర షూటింగ్స్ అన్నీ పూర్తి చేసి అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీనపై క్లారిటీ రావలసి ఉంది.