Home » Andhra Pradesh » Pawan Kalyan Shocking Commentson Telanagana Politics
andhra pradesh

pawan kalyan : తెలంగాణ జనసేన నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 14, 2023, 3:00 pm
Advertisement

pawan kalyan : మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇన్చార్జిలను ప్రకటించడం జరిగింది. పార్టీని స్థాపించడం ఎంత సులువో దాన్ని ముందుకు కొనసాగించటం చాలా కష్టం అని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలమైన శక్తిగా అవతరిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

ప్రశ్నించే తత్వం నాయకులలో ఉండాలని అన్నారు. తెలంగాణ సాధించిన ఉద్దేశం ఒకటైతే… ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మరోలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేని పరిస్థితి అక్కడ నెలకొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పోరాటానికి సిద్ధపడాలి. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి జనసేన ఎప్పుడూ తనవంతుగా కృషి చేయడానికి సిద్ధంగా ఉంది. పార్టీ అధినాయకత్వం ఏ పని ఇచ్చినా ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలి. ముందు ఒక మాట వెనకాల మరో మాట మాట్లాడితే మీరే నష్టపోతారు.

pawan kalyan shocking commentson telanagana politic

Advertisement

తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి నాకు తెలిసే ఆందోళన కూడా అప్పుడే ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర లో పాటు తెలంగాణలో కూడా వారాహి యాత్ర జరగనుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉండి పార్టీ గొంతు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని సూచించారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి తన వంతుగా అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలంగాణ జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి