Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు విదేశీ భాషలలో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
రోజుకు ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం విడుదలైన మూడు రోజుల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 50 రూపాయలు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల పెంపు పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి. ఆదిపురుష్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతకుముందు విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రజలను బాగా ఆకర్షించాయి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడంతో సెలబ్రిటీలు సైతం ఈ సినిమా టికెట్లను ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. సుమారుగా 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. కాగా నాన్ థియేట్రికల్ రైట్స్ దక్షిణాది రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కలిపి ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నిర్మాతలకు రూ.400కోట్లపైగా రికవరీ అయ్యాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కలెక్షన్లు రూ.వెయ్యి కోట్లు దాటుతాయని అంచనాలు ఉన్నాయి. మరి ఏ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.