Thaman wife : సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక సెలబ్రిటీల విషయంలో ట్రోలింగ్ అనేది ఒక సమస్యగా మారిపోయింది. చిన్న స్టార్ ల నుండి పెద్ద స్టార్ల వరకు చాలామంది ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. సినిమా వాళ్లు మాత్రమే కాదు సెలబ్రిటీ ఎవరైనా క్రికెటర్ అయిన లేదా రాజకీయ నాయకుడైన వ్యాపార రంగంలో దిగ్గజాలు అయిన ట్రోలింగ్ బారిన పడాల్సిందే. ఈ రకంగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలలో మ్యూజిక్ డైరెక్టర్లలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడినది ఎస్ ఎస్ తమన్.. అని చెప్పవచ్చు. తమన్నా అందించిన చాలా సినిమాలకు కాపీ ట్యూన్లు కొట్టాడని… ట్రోలింగ్ గురయ్యారు. పాటల విషయంలో మరియు ట్యూన్స్ విషయంలో తమన్ పై సోషల్ మీడియాలో చాలాసార్లు నెగెటివిటీ విస్తరించింది.
కెరియర్ పరంగా ప్రారంభంలో ట్రోలింగ్ విషయంలో ఇబ్బంది పడిన తమన్… ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసుకోవడం జరిగింది. తనపై వచ్చే నెగెటివిటీ.. ట్రోలింగ్ కి సంబంధించి ఆయనే జోకులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తమన్ భార్య మాత్రం అతని విషయంలో ఈ ట్రోలింగ్ కి సంబంధించి చాలా బాధపడేదట. ఎవరికి చెప్పుకోలేక.. సోషల్ మీడియాలో భర్తని ఆడుకుంటూ జోకులేస్తూ మీమీస్ వాటిని చూసి తెగ ఫీలయ్యావారట. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల ఓ టీవీ షోలో ఇంటర్వ్యూలో తెలిపింది. తమన్ భార్య వర్ధిని కూడా ఓ సింగర్.
ఆమె పలు సినిమాలలో కూడా పడటం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ పై ట్రోలింగ్ పై స్పందించారు. “తమన్ ఇంటర్వ్యూలు చూస్తాను. కానీ వీడియోల కింద వచ్చే కామెంట్స్ చదవను. నేను చాలా సెన్సిటివ్ పర్సన్. నా భర్త పై వచ్చే ట్రోల్స్ చూస్తే బాధగా అనిపిస్తుంది అంటూ వాటి జోలికి వెళ్ళను. ఇదే సమయంలో నేను ఎలాంటి రిప్లై ఇవ్వను. చూసిన వెంటనే వదిలేస్తాను. భర్త దగ్గర కూడా ట్రొల్స్ గురించి చర్చ రాదు. ఇంట్లో అసలు వీటి గురించి మాట్లాడుకోం. తమన్ నీ ట్రోల్ చేసేవాళ్లు అదే రీతిలో అభినందించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ భార్య వర్ధిని ఇంటర్వ్యూలో రియాక్ట్ కావడం జరిగింది.
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
This website uses cookies.