Pawan kalyan : మరోసారి అనారోగ్యం బారిన పడ్డ పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
Pawan kalyan : రీల్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరి మనస్సులు గెలుచుకున్నాడు.ఆయన రాజకీయాలలోకి వచ్చాక తనదైన శైలిలో దూసుకుపోతూ ఒకవైపు విమర్శలు,మరోవైపు ప్రశంసలు అందుకున్నాడు.ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉంటున్నారు.. వరద సహాయక చర్యలపై సమీక్షలు చేస్తున్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే తాను విజయవాడలో సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులు అంతా జ్వరాలతో బాధపడుతున్నారని సమచారం. ట్రీట్మెంట్ జరుగుతోందని, మెల్లిగా కోలుకుంటున్నారని , వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద సహాయ చర్యలపై మునిగారు. రెండు రోజులు అధికారులతో సమీక్షలు చేశారు. వర్షాలతో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై కూడా సమీక్ష చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అధికారులకు ఆదేశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Pawan kalyan : మరోసారి అనారోగ్యం బారిన పడ్డ పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని.. వెంటనే సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉంటుందన్నారు. ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.. వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో కూడా అనారోగ్యం బారిన పడ్డారు. పవన్ కొద్దిగా తన ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.