Pawan kalyan : మ‌రోసారి అనారోగ్యం బారిన ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 6 September 2024, 12:00 pm
  •  Pawan kalyan : మ‌రోసారి అనారోగ్యం బారిన ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్..!

Pawan kalyan : రీల్ లైఫ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అంద‌రి మ‌నస్సులు గెలుచుకున్నాడు.ఆయ‌న రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ ఒక‌వైపు విమ‌ర్శ‌లు,మరోవైపు ప్ర‌శంస‌లు అందుకున్నాడు.ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉంటున్నారు.. వరద సహాయక చర్యలపై సమీక్షలు చేస్తున్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే తాను విజయవాడలో సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవ‎ర్‎తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Pawan kalyan ప‌వ‌న్‌కి ఏమైంది…

ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులు అంతా జ్వరాలతో బాధపడుతున్నారని సమచారం. ట్రీట్మెంట్ జరుగుతోందని, మెల్లిగా కోలుకుంటున్నారని , వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద సహాయ చర్యలపై మునిగారు. రెండు రోజులు అధికారులతో సమీక్షలు చేశారు. వర్షాలతో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా సమీక్ష చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అధికారులకు ఆదేశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

Pawan kalyan : మ‌రోసారి అనారోగ్యం బారిన ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్..!

Pawan kalyan : మ‌రోసారి అనారోగ్యం బారిన ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్..!

వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని.. వెంటనే సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉంటుందన్నారు. ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.. వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ కళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా అనారోగ్యం బారిన ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆయ‌న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం స‌మ‌యంలో కూడా అనారోగ్యం బారిన ప‌డ్డారు. ప‌వ‌న్ కొద్దిగా త‌న ఆరోగ్యంపై కూడా ఫోక‌స్ పెడితే బాగుంటుంద‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  2. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  3. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  4. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  5. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  6. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  7. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp