Pawan kalyan : పొత్తు కోసం త్యాగాలు తప్పట్లేదు.. న‌న్ను క్ష‌మించండి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : పొత్తు కోసం త్యాగాలు తప్పట్లేదు.. న‌న్ను క్ష‌మించండి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Pawan kalyan : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. అయితే తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలకు తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్ని స్థానాలు తీసుకున్నది ముఖ్యం కాదని స్ట్రైక్ రేటు ముఖ్యమని అన్నారు. గెలిచే అవకాశం […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : పొత్తు కోసం త్యాగాలు తప్పట్లేదు.. న‌న్ను క్ష‌మించండి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Pawan kalyan : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. అయితే తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలకు తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్ని స్థానాలు తీసుకున్నది ముఖ్యం కాదని స్ట్రైక్ రేటు ముఖ్యమని అన్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను మాత్రమే పోటీలో నిలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు తక్కువ సీట్లు తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. 24 స్థానాలు అయినప్పటికీ 98% అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారని, అయితే గత ఎన్నికల్లో జనసేనకు కనీసం పది స్థానాలు గెలిపించి ఉంటే ఇప్పుడు స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పోటీ చేసే స్థానాలు 24 మాత్రమే కనిపిస్తున్నాయని, మూడు లోక్ సభ స్థానాలు పోటీ చేస్తుండడం వలన 40 స్థానాలు పోటీ చేస్తున్నట్లే లెక్క అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసేది 24 స్థానాలు అని తెలిసినప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత తతంగం నడపడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. సొంతంగా పోటీ చేస్తే సరిపోతుంది కదా పొత్తు ఎందుకని అభిప్రాయపడుతున్నారు.

పోటీ చేసేది 24 స్థానాల్లో అయినా మూడు లోక సభ స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల మొత్తం 40 స్థానాల్లో పోటీ చేసినట్టు లెక్క అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం పైన కూడా జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసినంత మాత్రాన 40 స్థానాల్లో పోటీ చేసినట్లు ఎలా అవుతుందని వారు పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు జనసేన ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, అన్ని స్థానాల పోటీ చేస్తుందని సోషల్ మీడియాలో హంగామా చేసిన జన సైనికులు తమ పార్టీ పోటీ చేసేది 24 స్థానాలు మాత్రమే అని తెలియడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పొత్తు కోసం త్యాగాలు తప్పట్లేదు అనిమ ప్రజలకు మంచి చేయడానికి పొత్తులో చేరాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది