Home » Andhra Pradesh » Pawan Kalyan Tribute To Soldier Murali Naik
andhra pradesh

Pawan kalyan : ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్.. కాల్పుల విర‌ణ‌మ‌ను న‌మ్మ‌లేము..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 11, 2025, 12:04 pm
Advertisement

Pawan kalyan : వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు.. మురళీ నాయక్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.

Advertisement

Pawan kalyan : ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్.. కాల్పుల విర‌ణ‌మ‌ను న‌మ్మ‌లేము..!

Pawan kalyan ప‌వ‌న్ కంట క‌న్నీరు..

మంత్రులు నారా లోకేష్. మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు.

Advertisement

అయితే కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన 3 గంటలకే వక్ర బుద్ధి ప్రదర్శించింది. వాళ్ల‌ని న‌మ్మ‌లేము. మ‌నంద‌రం మోడీ గారికి సైన్యానికి అండ‌గా ఉందాం అంటూ ప‌వ‌న్ అన్నారు. జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సహాయం అందిస్తాన‌ని పవన్ కళ్యాణ్ ప్ర‌క‌టించారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి