Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి
Peddi Reddy Ramachandra Reddy : వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి midhun reddy లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుట్రే కారణమని పెద్దిరెడ్డి ఆరోపించారు. గతంలోనూ ఎయిర్‌పోర్టు మేనేజర్‌ను అడ్డుపెట్టుకుని తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని, అది నిలబడనట్లే ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసు నిలబడదని పేర్కొన్నారు.
Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి
ఎంపీగా మూడుసార్లు విజయం సాధించిన మిథున్ రెడ్డి, వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారన్న కారణంగానే కుట్రలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైళ్ల పేరిట ప్రచారం చేసినా, వాటిల్లో తమపై ఎలాంటి తప్పులు లేవని ఇప్పటికే రుజువైందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల ద్వారా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరణతో కూడిన చర్య అని, ఈ కేసు కూడా కోర్టులో నిలబడదని స్పష్టంచేశారు.
తాము ఎలాంటి తప్పూ చేయలేదని, మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పెద్దిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై ఉన్న ద్వేషం కారణంగా ప్రభుత్వం కుట్రలు చేసుకుంటోందని, ప్రజలు ఈ దుర్మార్గాలకి తగిన సమాధానం చెప్పే రోజు దూరంగా లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, ప్రజల దృష్టి మరల్చేందుకు విపక్ష నేతల అరెస్ట్‌లకు తెగబడుతోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేక మహిళలు, యువతను మోసం చేస్తోందని అన్నారు.
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
This website uses cookies.