Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? - జగన్ ఫైర్
Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో పాలన పరంగా నెలకొన్న పరిణామాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారంతో పాటు అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి? బెదిరింపులు ఏంటి?” అంటూ చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు అబద్ధాల పాలన కోసం ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.
Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? – జగన్ ఫైర్
తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపు చర్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వంటి పలువురు కీలక నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. గన్‌మెన్‌ను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వించాలని పాల్పడిన చర్యలు దారుణమని జగన్ అన్నారు. మద్యం కేసులో చట్ట విరుద్ధంగా అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు పాలన ప్రారంభమై ఒక సంవత్సరం కావొచ్చే లోపే ప్రజల్లో అసహనం పెరిగిందని జగన్ పేర్కొన్నారు. దీనిని దాచేందుకు టీడీపీ ప్రభుత్వం “డైవర్షన్ పాలిటిక్స్” ద్వారా వైఎస్సార్సీపీపై అప్రచారానికి దిగుతోందని విమర్శించారు. రెంటపాళ్ల, పొదిలి ఘటనలను ప్రస్తావిస్తూ, తమ కార్యకర్తల పట్ల పోలీసులు అవలంభిస్తున్న దౌర్జన్య చర్యలను ఖండించారు. “ప్రజల సమస్యలు ఎత్తి చూపిన వారిపై కూడా కేసులు పెడితే ప్రజాస్వామ్యంలో విలువలు ఎలా ఉంటాయంటారు?” అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన తీరుపై ప్రజల్లో ఆవేదన తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.