Chandrababu : ఇక‌పై నా కాళ్లకు మొక్కోద్డు.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఇక‌పై నా కాళ్లకు మొక్కోద్డు.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,2:59 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ఇక‌పై నా కాళ్లకు మొక్కోద్డు.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి..!

Chandrababu : ఏపీ సీఎం గా ఎంపికైన చంద్రబాబు ఆయనకిది మొదటిసారి కాకపోయినా ఎందుకో ఈసారి ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ 3 సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకున్నా ఏపీలో ఉంది ఎన్.డీ.ఏ ప్రభుత్వం అని చెబుతూ ప్రజలకు షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. అంతేకాదు ఈసారి సీఎం పదవిలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సీఎం గా పదవి తీసుకున్న దగ్గర నుంచి ఏపీ అభివృద్ధి కోసమే చంద్రబాబు పనులు చేస్తున్నారు. గత ప్రభుత్వ విధి విధానాల వల్ల రాష్ట్ర అన్ని విధాలుగా వెనక పడ్డది. అందుకే ముందు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి మార్గంలో నడిచేలా ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకుంటున్నారు చంద్రబాబు. ఐతే ఈ క్రమంలో కాళ్ల మీద పడే సంస్కృతిని వీడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Chandrababu నేను కూడా కాళ్ల మీద పడతా..

ఏపీ సీఎం చంద్రబాబు ఒక గొప్ప ఇన్షియేషన్ తీసుకున్నారు. ఇక మీదట తన కాళ్ల మీద ఎవరైనా పడితే తాను కూడా అవతల వారి కాళ్లకి మొక్కుతా అని అన్నాడు. అదేంటి అనుకోవచ్చు.. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. వాళ్ల కాళ్లకి మొక్కితే చాలు నా కాళ్లకు మొక్కాల్సిన పనిలేదని అంటున్నారు చంద్రబాబు. ఇక మీదట తన కాళ్ల మీద ఎవరు పడొద్ధని.. ఇలాంటి సంస్కృతిని ఇక ఆపేద్దామని అన్నారు చంద్రబాబు. టీడీపీ క్యాడర్ కి చంద్రాబుని చూడగానే కొందరు కాళ్ల మీద పడిపోతుంటారు. ఐతే ఇక మీదట అలాంటిది వద్దంటున్నారు చంద్రబాబు.

Chandrababu ఇక‌పై నా కాళ్లకు మొక్కోద్డు కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి

Chandrababu : ఇక‌పై నా కాళ్లకు మొక్కోద్డు.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి..!

తన కాళ్ల మీద ఎవరు పడొద్దని. ఒకవేళ అలా పడితే తను కూడా వారి కాళ్లను పట్టుకున్నానని అన్నారు. కాళ్లు మొక్కే సంస్కృతిని ఇక మీదట కొనసాగించ కూడదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గత ప్రభుత్వ చేసిన అవకతవకలు.. ఆర్ధిక సంక్షోభం గురించి చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. కేంద్రం నుంచి భారీ సాయం అందుకుంటే తప్ప ఏపీని అభివృద్ధి చేయడం కుదరదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది