Yogandhra 2025 : యోగాంధ్ర ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది .. మోడీ
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ యోగా కార్యక్రమంలో 3.01 లక్షల మంది పాల్గొనడం గర్వకారణం. ఈ తరహాలో పెద్దఎత్తున యోగా నిర్వహించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. గతంలో గుజరాత్‌లోని సూరత్ నగరంలో 1.47 లక్షల మంది పాల్గొన్న రికార్డును ఇది అధిగమించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరై కార్యక్రమానికి మరింత ప్రతిష్టను తీసుకువచ్చారు.
Yogandhra 2025 : యోగాంధ్ర ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది .. మోడీ
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగ వయస్సు, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా అందరికీ శ్రేయస్సు అందించే సాధనం అని పేర్కొన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు. యోగా ప్రతిపాదనకు ప్రపంచంలోని 175 దేశాలు మద్దతు తెలిపినదీ గర్వించదగిన విషయం. “వన్ ఎర్త్ – వన్ హెల్త్” అనే థీమ్‌ను ఆధారంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిందని ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించిందని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ సమస్యలకు పరిష్కారంగా యోగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. గుండె జబ్బులు, మానసిక సమస్యలు, నరాల సంబంధిత అనారోగ్యాల చికిత్సలో యోగా ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. యోగా ద్వారా ప్రపంచ శాంతి సాధ్యం అనే సందేశాన్ని ప్రధాని ఇచ్చారు. భారతీయ సంస్కృతి పరస్పర శ్రేయస్సు కోరుకునే మానవతావాద పద్ధతిగా యోగా ద్వారా ప్రపంచానికి సందేశమిచ్చిందన్నారు. భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య కేంద్రంగా ఎదుగుతోందని, అందుకు యోగా గొప్ప దోహదం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.