AP Elections : మొదటి జెండా సభలోనే కుప్ప కూలిపోయిన కూటమి… ముందంజలో వైసీపీ…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

AP Elections : మొదటి జెండా సభలోనే కుప్ప కూలిపోయిన కూటమి… ముందంజలో వైసీపీ…!

AP Elections : ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు వ్యూహాలను రచిస్తూ తమతైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ సమయంలో రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఒక విద్యార్థికి పరీక్షలు అనేవి ఎంత ప్రధానమైనవో ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్స్ అనేవి అంత ప్రాధాన్యమైనవి. ఇక పరీక్షల్లో ఎలా చదివారు అనే దాని […]

 Authored By tech | The Telugu News | Updated on :1 March 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Elections : మొదటి జెండా సభలోనే కుప్ప కూలిపోయిన కూటమి... ముందంజలో వైసీపీ...!

AP Elections : ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు వ్యూహాలను రచిస్తూ తమతైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ సమయంలో రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఒక విద్యార్థికి పరీక్షలు అనేవి ఎంత ప్రధానమైనవో ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్స్ అనేవి అంత ప్రాధాన్యమైనవి. ఇక పరీక్షల్లో ఎలా చదివారు అనే దాని పైన విద్యార్థుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇదే ఫార్ములా ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో లో రాజకీయ నాయకులు ఎలాంటి వ్యూహాలతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారో అవి వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఆరితేరినట్లుగా కనిపిస్తున్నారు.

కానీ కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేనకు మాత్రం ఈ ఫార్ములా అర్థం కావడం లేదని పలువురు తెలియజేస్తున్నారు. అందుకే ఒక విషయంలో అధికార పార్టీ వైసీపీ సక్సెస్ అయిందని జనసేన టీడీపీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని పలువురు తెలియజేస్తున్నారు.అయితే వైసీపీ పార్టీ సిద్ధం అనే పేరుతో సభలను నిర్వహిస్తుంటే కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన కలిసి జెండా పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు భీమిలి , దెందులూరు ,రాప్తాడులో మూడు సిద్ధం సభలను నిర్వహించడం జరిగింది. ఇక ఈ సిద్ధం సభలు కూడా ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. అదేవిధంగా చివరిసారిగా ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాచారం ప్రకారం సౌత్ లో రాజకీయ సభలకు ఇంత జనం రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.ఈ విధంగా జగన్ భారీ సక్సెస్ అందుకుంటే తాజాగా ఫిబ్రవరి 28న టీడీపీ మరియు జనసేన కూటమి నిర్వహించిన “జెండా ” సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు కూడా ఎవరు ఊహించి ఉండరు.ఆ విధంగా కూటమి నిర్వహించిన జెండా సభ అట్టర్ ప్లాప్ అయిందని చెప్పాలి.

అంతేకాక ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది , ఎలాంటి పనులు నిర్వహిస్తారనే విషయాల గురించి చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేసిన జెండా సభలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారు ఏం చేస్తారనే విషయాలను ప్రజలకు చెప్పడం మానేసి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. అంతేకాక జన సమూహం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ కనిపించిందని చెప్పాలి. ఇలా మొదటి సభ అట్టర్ ప్లాప్ అవడంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది