AP Elections : ఏపీ ఎన్నికల కంటే సినిమాలే బెటర్.. ఇదేం విధ్వంసం రా బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Elections : ఏపీ ఎన్నికల కంటే సినిమాలే బెటర్.. ఇదేం విధ్వంసం రా బాబు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2024,7:30 am

AP Elections : ఏపీ ఎన్నికలు అంటేనే దేశంలో చాలా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా జరగనన్ని గొడవలు ఎక్కువగా ఏపీలోనే జరుగుతుంటాయి. ఢీ అంటే ఢీ అన్నట్టే ఇక్కడి పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఉంటారు. పైగా ఇక్కడ అభ్యర్థులు గెలవడం కోసం విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతారనే టాక్ కూడా ఎప్పటి నుంచో ఉంది. అందుకు తగ్గట్టే ఏపీలో ఎప్పటి నుంచో ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఎన్నికలు అంటే ఎలా ఉంటాయో.. ఎలాంటి గొడవలు జరుగుతాయో చూపించేవారు. అప్పట్లో సోషల్ మీడియా అంత బలంగా లేదు.

AP Elections ఉత్తరాంధ్రలో సైలెంట్..

దాంతో సినిమాల్లో చూపించినట్టే ఏపీ రాజకీయాలు, ఎన్నికలు ఉంటాయేమో అని అంతా అనుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగానే ఏపీ ఎన్నికలు ఎంత దారుణంగా ఉంటాయో బయట పడింది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా ఓటర్ ను కొట్టడం.. తిరిగి ఆ ఓటర్ ఎమ్మెల్యే అభ్యర్థిని కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఉత్తరాంధ్రలో పెద్దగా గొడవలు జరగలేదు గానీ.. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అయితే విధ్వంసంలా సాగింది పోలింగ్. ఇక్కడ ఏకంగా ఒక పార్టీ అభ్యర్థి మీద ఇంకో పార్టీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు.

రాళ్లు విసురుకున్నారు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొందరి తలలు పగిలాయి. ఇంకో ఎమ్మెల్యే అయితే ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ ను బయటకు బలవంతంగా లాక్కొచ్చి మరీ రిగ్గింగ్ కు పాల్పడే ప్రయత్నం చేశారు. దాంతో అవతలి పార్టీ వారు ఆ ఎమ్మెల్యేని తరిమారు. రోడ్లపై పరిగెత్తించారు. కొన్ని చోట్ల అయితే వెంటాడి, వెంటాడి మరీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎం బాక్సులను ధ్వంసం చేశారు. ఇంకొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందిపై దాడులు జరిగాయి. రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కుదరని చోట ఓటర్లను బెదిరించారు.

AP Elections ఏపీ ఎన్నికల కంటే సినిమాలే బెటర్ ఇదేం విధ్వంసం రా బాబు

AP Elections : ఏపీ ఎన్నికల కంటే సినిమాలే బెటర్.. ఇదేం విధ్వంసం రా బాబు..!

కొంతమంది ఓటర్లు ఒప్పుకోకపోతే వారిపై కూడా దాడులు చేశారు. కత్తులతో దాడులు చేసుకున్నారు. నాటు బాంబులు విసురుకున్నారు. చివరకు పోలీసుల మీద కూడా దాడులు చేశారంటే ఏపీలో పోలింగ్ ఏ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది