AP Elections : గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ… నిరాశలో కూటమి..!
AP Elections : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలు నిన్నటితో ముగుస్తాయి. ఇక ఇప్పుడు రాష్ట్రమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముగిసిన తర్వాత వైసీపీ పార్టీ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక కూటమి వైపు చూసినట్లయితే కాస్త నిరాశ కనిపిస్తోంది. దీనికి గల ముఖ్య కారణం పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైసీపీ పార్టీ శ్రేణులు ముందస్తుగా కనిపించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో రెట్టింపు జోష్ తో వీరంతా కదిలి పని చేశారు. ఇక నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు ,దివ్యంగుల సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు మరియు నేటి యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఓటు వేసిన తర్వాత వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తుంటే వైసీపీ పార్టీకి ఉత్సాహం ఉరుకలేస్తుంది. ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలు ముఖ్య నేతలు అందరూ కూడా పోలింగ్ సరళి పై ఒక అంచనాకు వచ్చారు. దీంతో నిన్న ఎన్నికలకు పోటెత్తి వచ్చిన ఓటర్లు ముఖ్యంగా మహిళలు వృద్ధులు గ్రామీణులే ఎవరు గెలుస్తారనేది నిశ్చయించారని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనకు మెచ్చి మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జూన్ 4 వరకు ఎన్నికల ఫలితాల కోసం ఉత్సహంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదని , జగన్ గెలుపు నిన్ననే నిశ్చయమైందంటూ వైసీపీ పార్టీ నేతలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరికి ఒకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యాలయాలు కార్యకర్తల కేరింతలతో ఉల్లాసంగా మారాయి.
AP Elections కామ్ గా ఉన్న కూటమి…
మరోవైపు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళి మేరకు నిరాశ్యం ఏర్పడి అసహనం పెరిగి పలు ప్రాంతాలలో దాడులకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ ఓటర్లు ప్రలోభాలకు లొంగలేదని తెలుస్తోంది. ఓటమి భయంతోనే కూటమి నేతలు గొడవలకు దిగారని అయినప్పటికీ ఓటర్లు బెదర్లేదని పలువురు చెబుతున్నారు. పోలింగ్ ఉదయం నుండి ప్రారంభం కాగా బారులు తిరిన ఓటర్లు వైసీపీ పార్టీ గెలుపును ఆకాంక్షించారని అంటున్నారు.