Raghu Rama Krishnam Raju – YS Jagan : నర్సాపురంలో గెలుపెవరిది.. రఘురామకృష్ణంరాజు VS వైయస్ జగన్..!!
Raghu Rama Krishnam Raju – YS Jagan : దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు మధ్య వివాదం నడుస్తుంది. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇరకాటంలో పెడుతూ వస్తున్న రఘురామకృష్ణంరాజు వైయస్ జగన్ వైపు నుంచి షాక్ పడింది. ఏపీ సీఐడీ తనను కొట్టిందంటూ ఆరోపణలు చేశారు. కొద్దికాలం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఏపీకి వచ్చి వెళ్లిన రఘురామకృష్ణంరాజు మళ్లీ నరసాపురం నుంచి జనసేన లేదా టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా ఆయన వైయస్ జగన్ ను రెచ్చగొట్టే విధంగా నా వైపు క్యాండిడేట్ ఎవరిని పెడుతున్నారు అని మాట్లాడారు.
అయితే రఘురామకృష్ణం రాజును రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు వైయస్ జగన్ నరసాపురం నుంచి తన చెల్లిలిని పోటీ చేయించనున్నారు. ఉమా బాల అనే మహిళను వైయస్ జగన్ చెల్లి అని పిలుస్తుంటారు. బీసీ మహిళ అయిన ఆమెను నరసాపురం నుంచి పోటీ చేయించాలని వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. కాపు రెడ్డి సామాజిక వర్గపు ఓట్లు రఘురామకృష్ణం రాజుకు పడతాయి. ఇక బీసీ ఓట్లు అన్ని ఉమా బాలాకు పడతాయి అని కొత్త ఐడియాతో వైఎస్ జగన్ ఆమెను బరిలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఇక ఉమా బాలాకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అటువంటి వ్యక్తిని వైయస్ జగన్ ఎంచుకున్నారు.
ఈసారి వైయస్ జగన్ సామాజిక సమీకరణాలను తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తు ఉండడంతో బీసీ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. గోదావరి 5 పార్లమెంట్ స్థానాల్లో రాజమండ్రి, నర్సాపురంమ ఏలూరు ఎంపీ టికెట్లను ఆల్రెడీ బీసీలకు కేటాయించారు. తూర్పుగోదావరిలో బీసీ, కాపు సామాజిక వర్గాలకు మెజారిటీ సీట్లు ఖరారు చేశారు. నర్సాపురంలో రఘురామకృష్ణం రాజును ఓడించాలని వైయస్ జగన్ ఉమాబాలను రంగంలోకి దింపారు. నర్సాపురం పార్లమెంట్ స్థానాల్లో కాపు క్షత్రియ శెట్టిబలి మత్సకార వర్గాలు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నాగబాబు జనసేన నుంచి పోటీ చేస్తే రెండు లక్షల 50 వేల ఓట్లు పొందారు.