Rajasekhar Reddy : వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకిలా చీలింది… జ‌గ‌న్ వైపు ఎవ‌రు,ష‌ర్మిళ‌వైపు ఎవరు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajasekhar Reddy : వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకిలా చీలింది… జ‌గ‌న్ వైపు ఎవ‌రు,ష‌ర్మిళ‌వైపు ఎవరు ?

 Authored By ramu | The Telugu News | Updated on :2 November 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajasekhar Reddy : వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకిలా చీలింది... జ‌గ‌న్ వైపు ఎవ‌రు,ష‌ర్మిళ‌వైపు ఎవరు ?

Rajasekhar Reddy : ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వేరు, ఇప్పుడు వైఎస్ కుటుంబం వేరు. రాజకీయంగా అన్నాచెల్లెళ్లు జగన్‌, షర్మిల చెరోదారిలో చేస్తున్న ప్రయాణం.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకూ కారణమవుతోంది. తమ కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే అని జగన్‌ తొలిసారి ఓపెన్ అయ్యారు. దీనికి షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ వారసత్వం మొదలు.. పొలిటికల్‌గా ప్రతిదీ ఇప్పుడు షర్మిల సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం జగన్‌ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా వైఎస్‌ కుటుంబ విభేదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

Rajasekhar Reddy ఎవ‌రి స‌పోర్ట్ ఎవ‌రికి..

ఈ వివాదంలో వైఎస్‌ జగన్‌, షర్మిల, విజయమ్మలు రాసుకున్న లేఖలు రాజకీయాలను ఉత్కంఠగా మారుస్తున్నాయి. వీరి కుటుంబ విభేదాలను టీడీపీ పావుగా వాడుకుంటోంది. వైఎస్‌ కుటుంబ ప్రభను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే విజ‌య‌మ్మ ఇటీవ‌ల విడుద‌ల చేసిన లేఖ‌లో తాజా సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుందన్నారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారని, అయితే ఇలా కాదని, చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, తాను, పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళమని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని, తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయని విజయమ్మ తెలిపారు.

Rajasekhar Reddy వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకిలా చీలింది జ‌గ‌న్ వైపు ఎవ‌రుష‌ర్మిళ‌వైపు ఎవరు

Rajasekhar Reddy : వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకిలా చీలింది… జ‌గ‌న్ వైపు ఎవ‌రు,ష‌ర్మిళ‌వైపు ఎవరు ?

2019 వ‌ర‌కు వైఎస్ ఆర్ కుటుంబం బాగానే ఉన్నా వివేకానంద రెడ్డి , ష‌ర్మిళ రాజ‌కీయంగా విబేధించ‌డం, మ‌రోవైపు సునీత పోరాటం కుటుంబాన్ని అడ్డ‌గోలుగా చీల్చేశాయి. ఇప్పుడు జ‌గ‌న్ పులివెందుల వెళ్లిన కూడా బంధువుల ఇంటికి వెళ్ల‌డం లేద‌ని స‌మాచారం. అయితే జ‌గ‌న్ వైపు ఎవ‌రు ఉన్నారు, ష‌ర్మిళ వైపు ఎవ‌రు ఉన్నార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. జ‌గ‌న్‌కి అండ‌గా, వైవి సుబ్బారెడ్డి ,సొద‌రుడు అవినాష్ రెడ్డి, బాబాయ్ భాస్క‌ర్ రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి, మ‌ల్లికార్జున రెడ్డి, మేన‌త్త విమ‌ల‌మ్మ‌, మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇక ష‌ర్మిళ వైపు చూస్తే…త‌ల్లి విజ‌య‌మ్మ‌, భ‌ర్త అనీల్ కుమార్, సోద‌రి సునీత‌, చిన్న‌మ్మ సౌభాగ్య‌తో పాటు బాలినేని శ్రీనివాస‌రెడ్డి అండ‌గా ఉన్న‌ట్టు స‌మాచారం.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది