Chandrababu : చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ బాలకృష్ణపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. కర్నూలులో నోటీసులు ఇచ్చి చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కచ్చితంగా జైలుకెళ్లడం గ్యారెంటీ అని వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు పట్ల కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు అరెస్టు నీ నిరసిస్తున్న బాలకృష్ణ, పురందేశ్వరి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు బొచ్చు లేదని పురందేశ్వరికి బ్రెయిన్ లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎఫ్ఐఆర్ లో లేనిది.. ఎక్కడ అని నిలదీశారు.

Advertisement

ఆనాడు ఎన్టీఆర్ చంద్రబాబుని అవినీతి చక్రవర్తి అంటూ చెప్పారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని బాలయ్య పురందేశ్వరి వెనకేసుకొస్తున్నారు. బాలకృష్ణ బొచ్చుల లేస్, పురందేశ్వరి బ్రెయిన్ లెస్. ఎన్టీఆర్ కడుపున పుట్టిన వీళ్ళకి సిగ్గులేదు. చంద్రబాబు 420 అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. అటువంటి చంద్రబాబుని వెనకేసుకొస్తున్న వ్యక్తులు ఎన్టీఆర్ పరువు తీయడానికే పుట్టారు. పదవులు, డబ్బు కోసం పురందేశ్వరి, బాలకృష్ణ కలిసి ఎన్టీఆర్ ను మోసం చేశారు. బాలకృష్ణ.. బొచ్చులేస్ అని అందరికీ తెలుసు ఇప్పుడు.. బ్రెయిన్ లెస్ అనిపించుకున్నాడు.

Advertisement
reacting to chandrababu arrest kodali nani serious comments on balakrishna
reacting to chandrababu  arrest kodali nani serious  comments on balakrishna

లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నాడు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టును ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు. తన సొంత లాభం కోసం పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పార్టీ పెట్టించారని, తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడానికి తప్ప పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడని కొడాలి నాని విమర్శించారు.

Advertisement
Advertisement