Shyamala : ఎమ్మెల్యే 'గాలి` మాటలు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.. శ్యామల..!
Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల తీవ్రంగా ఖండించారు. గాలి భానుప్రకాశ్ మాట్లాడిన దిగజారుడు మాటలు సమాజం లోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. టీడీపీ నాయకులు మహిళలను ఎలా అగౌరవంగా చూస్తారో చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం. కనీసం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పుని ఒప్పుకుని ఆర్కే రోజా గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, మాజీ మహిళా మంత్రి అని కుడా చూడకుండా రోజా గారిని అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాశ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ శ్యామల డిమాండ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు..
Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాటలు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.. శ్యామల..!
మరోపక్క పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌కే రోజా జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తుంది? ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు,…
Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు…
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…
Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…
This website uses cookies.