Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •   ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై భగ్గుమంటున్న వైసీపీ

Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల తీవ్రంగా ఖండించారు. గాలి భానుప్ర‌కాశ్ మాట్లాడిన దిగజారుడు మాటలు సమాజం లోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. టీడీపీ నాయకులు మహిళలను ఎలా అగౌరవంగా చూస్తారో చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం. కనీసం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పుని ఒప్పుకుని ఆర్కే రోజా గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, మాజీ మహిళా మంత్రి అని కుడా చూడకుండా రోజా గారిని అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాశ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ శ్యామల డిమాండ్ చేస్తూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు..

Shyamala ఎమ్మెల్యే'గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..!

Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..!

Shyamala : టీడీపీ ఎమ్మెల్యే గాలిపై మహిళ కమిషన్‌కు రోజా ఫిర్యాదు

మరోపక్క పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మె­ల్యే గాలి భాను ప్రకాష్‌ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్‌ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌కే రోజా జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ల‌కు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్‌ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌నకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడిగా ఆమె అభివ‌ర్ణించారు. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తుంది? ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి నేత‌లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్‌ చేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది