Roja : తల్లిని మోసగిస్తే ఏమనాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!
ప్రధానాంశాలు:
తల్లిని మోసగిస్తే ఏమనాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!
Roja : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “తల్లికి వందనం” పథకంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రతీ విద్యార్థిని చదివించే తల్లికి రూ.15,000 చొప్పున నగదు అందిస్తామన్న హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా షరతులు పెట్టి కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చారుఅని ఆరోపిస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ షరతుల వల్ల అసలు తల్లులే మోసపోయారని, ప్రభుత్వం నిజంగా హామీని నిలబెట్టిందా అనే సందేహం ప్రజల్లో ఏర్పడుతుందంటూ రోజా ఫైర్ అయ్యారు.

Roja : తల్లిని మోసగిస్తే ఏమనాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!
Roja : తల్లిని మోసం చేసిన బాబు – రోజా ఫైర్
“తల్లికి వందనం” పథకానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను పూర్తిగా అర్హత లేని వారిగా ప్రకటించడం పై చివాట్లు పెట్టింది రోజా. గతంలో వైఎస్ జగన్ పాలనలో అమ్మ ఒడి పథకం కింద కేంద్ర పాఠశాలల్లో చదువుతున్నవారికీ లబ్ధి చేకూరిన సంగతి అధికారిక రికార్డుల్లో ఉంది. కానీ ప్రస్తుతం UDISE Plus డేటాబేస్ నుంచి కేంద్రీయ విద్యాలయాల పేర్లను తొలగించడం వల్ల ఈ విద్యార్థులు పథకానికి దూరమవుతున్నారు అని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో పథకాలను అమలు చేస్తున్నామంటూ ప్రకటిస్తుండగా, మరోవైపు అనేక పరిమితులు విధించడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని , ఎన్నికల సమయంలో లభించే రాజకీయ లాభం కోసమే ఇచ్చిన హామీలు, ఇప్పుడు పూర్తిగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు సంధించారు.