Categories: andhra pradeshNews

Roja :రోజా అనుకున్న‌ది అయిందా.. ఆమె బ‌లం ఎంత వ‌ర‌కు అక్క‌డ ప‌ని చేస్తుంది..!

Roja  : వైసీపీకి రెబ‌ల్‌గా ఉన్న రోజా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌లో దారుణ‌మైన ఓట‌మి చ‌విచూసింది. రోజా ఓటమి వెనక.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో.. సొంత పార్టీలో లుకలుకలు కూడా అంతే కారణం అనే ప్రచారం ఉంది . అయితే సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని.. పెద్దిరెడ్డికి, రోజాకు పొసగడం లేదని.. జగన్ హయాం నుంచి వినిపిస్తోంది. ఘోర పరాభవం తర్వాత.. వైసీపీలో పోస్టుమార్టం స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్‌లో రోజా ప్రతీకారం తీరినట్లు అయింది. రోజా అనుకున్నది సాధించారు.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు.. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి శాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Roja రోజా సాధించిందా..

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె.జె.కుమార్‌, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్‌ కె.జె.శాంతి, వీరి కుటుంబ సభ్యులు పార్టీకి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఇటీవల జగన్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుంచి తొలగిస్తున్నామని వైసీపీ అధిష్ఠానం తెలిపింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఇకపై వారి కార్యక్రమాలకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్‌ కె.ఆర్‌.జె భరత్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజానికి నగరిలో రోజా, కేజే దంపతుల మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయ్. కేజే దంపతులకు మరికొందరు లోకల్‌ వైసీపీ లీడర్లు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ వివాదం నడిచింది.

Roja :రోజా అనుకున్న‌ది అయిందా.. ఆమె బ‌లం ఎంత వ‌ర‌కు అక్క‌డ ప‌ని చేస్తుంది..!

మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు. కేజే కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ కనిపిస్తున్నారు.. అయితే గురువారం (సెప్టెంబర్ 12న) ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేజే దంపతులు స్పందించాల్సి ఉంది.

Recent Posts

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

31 minutes ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

2 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

3 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

4 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

5 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

5 hours ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

7 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

8 hours ago