Roja :రోజా అనుకున్నది అయిందా.. ఆమె బలం ఎంత వరకు అక్కడ పని చేస్తుంది..!
ప్రధానాంశాలు:
Roja :రోజా అనుకున్నది అయిందా.. ఆమె బలం ఎంత వరకు అక్కడ పని చేస్తుంది..!
Roja : వైసీపీకి రెబల్‌గా ఉన్న రోజా ఈ ఏడాది జరిగిన ఎన్నికలో దారుణమైన ఓటమి చవిచూసింది. రోజా ఓటమి వెనక.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో.. సొంత పార్టీలో లుకలుకలు కూడా అంతే కారణం అనే ప్రచారం ఉంది . అయితే సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని.. పెద్దిరెడ్డికి, రోజాకు పొసగడం లేదని.. జగన్ హయాం నుంచి వినిపిస్తోంది. ఘోర పరాభవం తర్వాత.. వైసీపీలో పోస్టుమార్టం స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్‌లో రోజా ప్రతీకారం తీరినట్లు అయింది. రోజా అనుకున్నది సాధించారు.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు.. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి శాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Roja రోజా సాధించిందా..
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె.జె.కుమార్, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కె.జె.శాంతి, వీరి కుటుంబ సభ్యులు పార్టీకి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఇటీవల జగన్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుంచి తొలగిస్తున్నామని వైసీపీ అధిష్ఠానం తెలిపింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఇకపై వారి కార్యక్రమాలకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కె.ఆర్.జె భరత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజానికి నగరిలో రోజా, కేజే దంపతుల మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయ్. కేజే దంపతులకు మరికొందరు లోకల్ వైసీపీ లీడర్లు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ వివాదం నడిచింది.
మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు. కేజే కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ కనిపిస్తున్నారు.. అయితే గురువారం (సెప్టెంబర్ 12న) ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేజే దంపతులు స్పందించాల్సి ఉంది.