Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  సీఎం చంద్రబాబు ఇలాకాలో మహిళకు ఎంత దారుణం జరిగిందో చూడండీ

  •  పవన్‌ కళ్యాణ్ చూస్తున్నావా.. మీ ప్రభుత్వంలో మహిళా రక్షణ ఇదేనా? - రోజా

  •  Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా

Roja : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య పాలనకు మచ్చని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దారుణం జరగడం చూడలేదని ఆమె మండిపడ్డారు. టీడీపీకి చెందిన వ్యక్తే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ, మహిళను అలా చెట్టుకు కట్టేసి కొట్టడం సామాజికంగా, మానవత్వ పరంగా హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు.

Roja చంద్రబాబు చూస్తున్నావా నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు రోజా

Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా

Roja : ఏ రాష్ట్రంలోనైనా ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం చూశామా ? – రోజా

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగాయని, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆర్‌కే రోజా విమర్శించారు. టీడీపీ నేతల దురాగతాలపై పోలీసులకు భయం లేకుండా పోయిందని, మహిళల రక్షణ గాలికొదిలేశారని అన్నారు. మంత్రులు మహిళల రక్షణపై స్పందించకపోవడం తగదన్నారు. హోం మంత్రిగా ఉన్న అనిత బాధిత మహిళను కలవకుండా వీడియో కాల్‌తో పరామర్శించడం తగదని ఆమె మండిపడ్డారు.

మహిళలపై జరుగుతున్న దాడులపై టోటల్ ఫెయిల్యూర్‌గా కూటమి ప్రభుత్వాన్ని రోజా అభివర్ణించారు. సాక్షి మీడియా వెలుగులోకి తెచ్చేవరకు చంద్రబాబు, హోం మంత్రికి ఈ విషయం తెలియదంటే అది హేయకార్యాచరణేనన్నారు. ఓట్లు వేయించుకోవడానికి మహిళలను ముందుకు తెచ్చే టీడీపీ నాయకులు, రక్షణ విషయానికి వచ్చేసరికి పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే బాధ్యతను చేపట్టి, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనితలకు సూచించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది