Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా
Roja : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య పాలనకు మచ్చని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దారుణం జరగడం చూడలేదని ఆమె మండిపడ్డారు. టీడీపీకి చెందిన వ్యక్తే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ, మహిళను అలా చెట్టుకు కట్టేసి కొట్టడం సామాజికంగా, మానవత్వ పరంగా హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు.
Roja : చంద్రబాబు చూస్తున్నావా..? నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదు : రోజా
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగాయని, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆర్‌కే రోజా విమర్శించారు. టీడీపీ నేతల దురాగతాలపై పోలీసులకు భయం లేకుండా పోయిందని, మహిళల రక్షణ గాలికొదిలేశారని అన్నారు. మంత్రులు మహిళల రక్షణపై స్పందించకపోవడం తగదన్నారు. హోం మంత్రిగా ఉన్న అనిత బాధిత మహిళను కలవకుండా వీడియో కాల్‌తో పరామర్శించడం తగదని ఆమె మండిపడ్డారు.
మహిళలపై జరుగుతున్న దాడులపై టోటల్ ఫెయిల్యూర్‌గా కూటమి ప్రభుత్వాన్ని రోజా అభివర్ణించారు. సాక్షి మీడియా వెలుగులోకి తెచ్చేవరకు చంద్రబాబు, హోం మంత్రికి ఈ విషయం తెలియదంటే అది హేయకార్యాచరణేనన్నారు. ఓట్లు వేయించుకోవడానికి మహిళలను ముందుకు తెచ్చే టీడీపీ నాయకులు, రక్షణ విషయానికి వచ్చేసరికి పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే బాధ్యతను చేపట్టి, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనితలకు సూచించారు.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
This website uses cookies.