Anakapalli : సీనియర్ వర్సెస్ జూనియర్.. అనకాపల్లిలో గెలుపెవరిది..?
ప్రధానాంశాలు:
Anakapalli : సీనియర్ వర్సెస్ జూనియర్.. అనకాపల్లిలో గెలుపెవరిది..?
Anakapalli : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చర్చ ఎన్నికల్లో గెలుపు, ఓటముల గురించే ఉంది. ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో అందరూ కొన్ని ప్రత్యేకనియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. గెలుపు ఎవరిది అనే దానిపై అక్కడి ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. అలాంటి నియోజకవర్గమే అనకాపల్లి. ఈ నియోజకవర్గం ఈసారి హైలెట్ కావడానికి కారణం కొణతాల రామకృష్ణ. ఆయన మొన్నటి వరకు వరకు మంత్రిగా ఉన్నారు. కానీ సడెన్ గా టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని కూటమి అభ్యర్థిగా మారారు. దాంతో ఇప్పుడు ఇక్కడి రాజకీయ వేడెక్కిపోయింది.
Anakapalli ఆయన కూటమి అభ్యర్థిగా..
తనను కాదని వెళ్లిపోయిన కొణతాలకు షాక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. అందుకే ఆయన ఇప్పుడు యంగ్ లీడర్ అయిన భరత్ కు అవకాశం ఇచ్చారు. అయితే అనకాపల్లిలో ఎప్పటి నుంచో కాంగ్రెస్, టీడీపీల మధ్యనే గతంలో పోరు ఉండేది. అప్పట్లో దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ మధ్యనే టఫ్ ఫైట్ ఉండేది. ఈ ఇద్దరూ ఉన్నంత కాలం వేరే వారికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కొణతాల కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు ఆయన గెలుపు కోసం తన రాజకీయ ప్రత్యర్థి అయిన దాడి వీరభద్రరావు కుటుబాన్ని కూడా కలుపుకుని పోయారు. ఇక నియోజకవర్గంలో కూడా విస్తృతంగా పర్యటించారు. ఈ నియోజకవర్గం మహిళా ఓటర్లదే పై చేయి. వారు ఎటువైపు ఓటేస్తే ఆ అభ్యర్థే గెలుస్తాడు.
అందుకే ఈ సారి ఇక్కడ గెలపు, ఓటమును నిర్ణయించేది మాత్రం మహిళా ఓటర్లు అనే చెప్పుకోవాలి. ఇక రాజకీయంగా సామాజికంగా ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నారు. కొణతాలకు రాజకీయం అనుభవం ఉంది. కానీ భరత్ కు ఏమీ లేదు. అందుకే ఈ సారి ప్రజలు సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ కూటమికే ఓటు వేశారని అంటున్నారు ఆ పార్టీల నేతలు. అందుకే ఈ సారి కొణతాల గెలుపు ఖాయం అంటున్నారు. ఇంకోవైపు భరత్ కోసం అన్ని విధాలుగా సహకరించారు జగన్. ఈ నియోజకవర్గంలో సీనియర్లు భరత్ తరఫున ప్రచారాలు కూడా చేశారు. అందుకే ఈ సారి గెలుపు ఎవరిదో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.