Vishakapatnam : టీడీపీ రాజకీయంలో భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక విశాఖపట్నంలో టీడీపీ పరిస్థితి చిత్రం గా సాగుతుంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది తెలియడం లేదు. విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీతో పొత్తు గనుక ఉంటే విశాఖ లోక్ సభ సీటును ఆ పార్టీ వదులుకోవాల్సి ఉంటుంది. దాంతో బాలయ్య అల్లుడు విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే సీట్ల కోసం వెతుకుతున్నారని ప్రచారం జరుగుతుంది. మొదట భీమిలి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని అనుకున్న అది పొత్తులో జనసేనకు పోతుంది. విశాఖ సౌత్ అనుకుంటే అక్కడ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పోటీగా ఉన్నారు .అటు ఇటు చూస్తే విశాఖ నార్త్ కనిపిస్తోంది.
విశాఖ నార్త్ నుంచి శ్రీ భరత్ పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. లోకేష్ శంఖారావం సభలో శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఉత్తర విశాఖ నుంచి పోటీ చేస్తారని అనుమానం కలుగుతుంది. ఉత్తర నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టేజ్ పైన ఉండగానే శ్రీ భరత్ ఆయన గాలి తీసేసేలా మాట్లాడారు. గంటా అందుబాటులో లేకపోయినా తాను ఉత్తర నియోజకవర్గం ప్రజలకు పార్టీ జనాలకు అండగా ఉంటానని శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ సమక్షంలో గంటాని అలా ఉత్తరానికి సంబంధం లేని నాయకుడిగా బాలయ్య అల్లుడు చేశారని అంటున్నారు. అయితే దానికి కూడా ఒక కారణం ఉంది.
నాలుగేళ్ల పాటు గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం పట్టించుకోలేదు. ఆయన గెలిచినా కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఎన్నికల ముందే యాక్టివ్ అవుతున్నారు. అయితే ఈసారి ఉత్తరం నుంచి పోటీ చేయరు వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారు అని అంటున్నారు. నార్త్ లో టీడీపీని ఇన్నేళ్లుగా గాలికి వదిలేసారు అన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. నారా లోకేష్ ఆ మాట అనలేదు కానీ ఆయన ఎదుటనే తోడల్లుడు అన్నాడు. అంటే గంటా విషయంలో టీడీపీ అధిష్టానం వేరేగా ఆలోచిస్తుందని ఆలోచనలు కూడా కలుగుతున్నాయట. గంటా అయితే భీమిలి మీద ఆశలు పెట్టుకున్నారు తప్పితే చోడవరం అడుగుతున్నారు అని అంటున్నారు. అయితే గంటా విషయంలో చంద్రబాబు నాయుడు ఏమీ ఆలోచిస్తారో ఏం రకమైన నిర్ణయం తీసుకుంటారు తెలియడం లేదు. శ్రీ భరత్ మాత్రం ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పి నార్త్ మీద కర్చీఫ్ వేశారని తెలుస్తుంది.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.