TDP BJP : ఇంకా టీడీపీ, బీజేపీ మధ్య తేలని పొత్తు.. కారణం ఏంటి..?

Authored By Ramu | The Telugu News | Updated on : 9 March 2024, 2:00 pm
  •  TDP BJP : ఇంకా టీడీపీ, బీజేపీ మధ్య తేలని పొత్తు.. కారణం ఏంటి..?

TDP BJP : ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ ని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక వీరితో బీజేపీ పొత్తు కూడా కలవబోతుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పొత్తుపై గంటకో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. పొత్తు ఖరారు అయిందని ఒకసారి లేదు ఇంకా చర్చలు జరుగుతున్నాయని మరోసారి. అన్ని ఓకే కానీ సీట్ల పంచాయతీ తేలలేదని ఇంకోసారి. ఇలా రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక తాజాగా బీజేపీ , టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు. ఇంకా సీట్ల పంచాయతీ విషయంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. కేవలం పొత్తును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. మరి పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమైంది అంటే బీజేపీ నేతల షెడ్యూల్ కారణంగానే అంటున్నారు.

పొత్తు లో సీట్ల ప్రకటన విషయంలో అమిత్ షా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ పార్టీ నాయకులను పిలిపించి ఎవరితో పొత్తు ఉండాలో, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ణయిస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ముందు ఒడిశా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. అక్కడ నవీన్ పట్నాయక్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే బీజేడీతో పొత్తులో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లు మిగతా సర్దుబాట్లపై వారితో చర్చించారు. అక్కడ బలాలను అంచనా వేసుకొని ఒక లిస్టు తయారు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోయే రెండో జాబితాలో ఒడిస్సాలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రేను కాదని వచ్చిన నేతల భవిష్యత్తుపై ఏకనాథ్ షిండే మహారాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఏకనాథ్ షిండే శివసేన, బీజేపీ ఇతర రెబల్ అభ్యర్థులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది చర్చించారు. అయితే రెండు మూడు సీట్లు వ్యవహారంలో ఇరువర్గాలు పట్టుబట్టారు. దీంతో అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి.

మహారాష్ట్ర సీటు వ్యవహారం త్వరగా తేల్చుకొని టీడీపీ, జనసేనతో చర్చించాల్సి ఉందని బీజేపీ అంటుంది. అయితే మహారాష్ట్ర పంచాయతీ సుదీర్ఘంగా కొనసాగడంతో ఏపీ వ్యవహారం వాయిదా వేసారని సమాచారం. దీనిపై ఈ రెండు రోజుల్లో కచ్చితంగా ప్రకటన వస్తుందని అంటున్నారు. ఏపీలో సీట్ల పంచాయతీ లేదని సమాచారం. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుందని, ఆ రెండు పార్టీలకు 8 వరకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని అంటున్నారు. ఇప్పటికే జనసేనకు ప్రకటించిన 24 స్థానాలు మినహాయిస్తే బీజేపీ ఆరు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతుంది. ఎంపి స్థానాల విషయానికి వస్తే జనసేనకు మూడు స్థానాలను ఇచ్చింది. మిగిలిన ఐదు స్థానాలు బీజేపీ అభ్యర్థులు నిలబడే అవకాశం ఉంటుంది. అరకు, కాకినాడ, రాజమండ్రి , అనకాపల్లి నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను జనసేన బీజేపీకి కేటాయించారు. మిగిలినవి టీడీపీ పోటీ చేయబోతుంది.

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp