Chandrababu : ఇప్పటికైనా అర్ధమైందా నాదెండ్ల ?? చంద్రబాబు ఎలాంటి వాడో !
Nadendla vs Chandrababu : ప్రస్తుతం ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. నిజానికి పొత్తులన్నీ ప్రతిపక్ష పార్టీలవే. అధికార పార్టీ వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఒక్క వైసీపీ పార్టీని ఎదుర్కోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పొత్తు అయితే ఖాయం అనే అనుకోవాలి. కానీ.. మధ్యలో బీజేపీని కూడా కలుపుకొని పోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అందుకే.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపారు.
అయినా కూడా బీజేపీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పొత్తుపై ఇంకా క్లారిటీ లేదు. అయితే.. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫమ్ కావడంతో ఇప్పటి నుంచే రెండు పార్టీల మధ్య సీట్ల లొల్లీ ప్రారంభం అయిందనే చెప్పుకోవాలి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూగా ఉన్న నేత నాదెండ్ల మనోహర్. ఆయన పోటీ కన్ఫమ్ అయింది. ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తా అని ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు టీడీపీ ముఖ్య నేత కూడా నాదెండ్ల పోటీ చేసే నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా అంటూ చెప్పడంతో ఏం చేయాలో జనసేన పార్టీ హైకమాండ్ కు అర్థం కావడం లేదు.
Chandrababu : తెనాలి కాకుండా మరో నియోజకవర్గంలో పోటీ చేయనంటున్న మనోహర్
నాదెండ్ల మనోహర్.. తెనాలిపైనే ఆశలు పెట్టుకున్నారు. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు కూడా అధికారికంగా ప్రకటన చేయకున్నా లోపల మాత్రం రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలని భావిస్తున్నాయి. అందుకే.. ఇప్పటి నుంచే సీట్ల గొడవ ప్రారంభం అయింది. ఒకవేళ బీజేపీ యాడ్ అయితే బెటర్.. లేదంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి వారాహి యాత్ర కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సీట్ల లొల్లి మాత్రం ఇంకా పెరుగుతోంది. సీట్ల లెక్క గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చిస్తారని నాదెండ్ల కూడా చెబుతుండటంతో పాటు తాను వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తానంటూ స్పష్టం చేయడంతో.. ముందే తాను పోటీ చేసే నియోజకవర్గం చెప్పి.. ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి ఇచ్చేది లేదని చెబుతున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ.. టీడీపీ ముఖ్యనేత ఆలపాటి మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను కూడా తెనాలి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో ఈ పొత్తుల గోల ఇప్పట్లో తేలదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.