Chandrababu : చంద్రబాబు వేసిన కొత్త ప్లాన్ తో జగన్ అలర్ట్ అవ్వాల్సిందే
Chandrababu : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇంకా సంవత్సరం సమయం ఉన్నా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సన్నద్ధం అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాయి పార్టీలు. అందుకే.. ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు.
ఇక ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని టీడీపీ తెగ ఉబలాటపడుతోంది. దానికి కారణం.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి. ఆ ఓటమిని మళ్లీ తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దని.. ఈసారి టీడీపీ ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి అగమ్యగోచరం కాబట్టి.. ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న కసిలో టీడీపీ ఉంది. చంద్రబాబు కూడా అలాంటి వ్యూహాలే రచిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చంద్రబాబు పర్యటనలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఆ స్పీడ్ ను ఇంకా పెంచి దూసుకుపోతున్నారు.అందుకే.. చంద్రబాబు మహానాడులో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే.. తమ సంక్షేమ అజెండా ఏంటో కూడా ప్రజలకు ముందే చెప్పేస్తోంది టీడీపీ. ఇప్పటికే నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రజల్లో మమేకం అవుతూ..
Chandrababu: అందుకే మహానాడులో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారా?
క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ బురద జల్లుతూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు కూడా వరుస పర్యటనలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో పర్యటిస్తూ టీడీపీ నేతలను యాక్టివ్ చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా చంద్రబాబు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి వెళ్లి బీజేపీతో మంతనాలు జరిపారు. పొత్తుల విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో చంద్రబాబు అయితే పొత్తు లేదంటే ఒంటరిగానైనా దూసుకెళ్లేందుకు సిద్ధం అన్న రేంజ్ లో వ్యూహాలు పన్నుతున్నారు. చూద్దాం మరి ఆయన వ్యూహాలు ఎంతమేరకు వర్కవుట్ అవుతాయో.