TDP: ఉన్నపళంగా అర్జెంట్ మీటింగ్ పెట్టిన చంద్రబాబు – భారీ టీం ఏర్పాటు ?
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేనిది స్థానిక సంస్థల ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. తెలుగు దేశం పార్టీ మొదటి సారి స్థానిక సంస్థల ఎన్నికలకు మానిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ పార్టీ కూడా మ్యాని ఫెస్టోను విడుదల చేసింది లేదు. ఇది ఎన్నికల సంఘంకు ఫిర్యాదు కూడా చేశారు. కాని ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం తప్పు ఏమీ కాదు అన్నట్లుగా ఎస్‌ఈసీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఈసీ నుండి కావాల్సినంత మద్దతు టీడీపీకి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవాలను చేయాలని ప్రయత్నిస్తే జరిగే పని లేదు. దాంతో తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించి గెలుపు సాధించి నైతికంగా వైఎస్ జగన్ పై విజయాన్ని సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
TDP: టీడీపీ టీమ్స్ రెడీ..
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి లోటు పాటు జరుగకుండా చూసుకోవడానికి తెలుగు దేశం పార్టీ పెద్ద టీమ్ ను ఏర్పాటు చేసుకుంది. చంద్రబాబు నాయుడ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 పార్లమెంట్ నియోజక వర్గాలను అయిదు జోన్లుగా విడదీసి బాధ్యులను ఎంపిక చేయడం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అందజేయడం జరిగింది. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ బాధ్యతలు చూసుకోబోతున్నారు. వారు క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకుని ప్రచారం వరకు అంతా చూసుకుంటారు.
అభ్యర్థులకు ప్రతి విషయంలో సహకారం.
ప్రత్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరియు లీగల్ గా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సహాయం అందించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు సిద్దంగా ఉంటారు. కింది స్తాయి తెలుగు తమ్ముళ్లు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రతి విషయంలో కూడా అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తాం అని వైకాపా అభ్యర్థుల నుండి ఏదైన ఇబ్బంది ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని లేదంటే ఎస్ఈసీకి సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. మొత్తానికి తెలుగు దేశం పార్టీ పక్కా టీమ్ లను ఏర్పాటు చేసి గెలుపే లక్ష్యంగా దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది చూడాలి.