TDP : ఎవరు ఈమె .. నంద్యాల ఎంపీని చేయాల్సిందే అని అంటున్న టీడీపీ..!
TDP : ఏపీలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక వైసీపీ ఒంటరి పోరు చేస్తుండగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక రాయలసీమలో ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు సంపాదించాలని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ లో వైసీపీ టీడీపీ ను క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఈసారి రాయలసీమ ప్రాంతంలో మంచి నెంబర్ దక్కాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. అయితే ఈసారి రాయలసీమను ఒక యంగ్ లేడీ ని ఎంపీగా నిలబెట్టాలని, ఆమెను ఎలాగైనా గెలిపించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.
లోక్ సభ స్థానాలపై కూడా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. నంద్యాల లోక్ సభ టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని టీడీపీ హై కమాండ్ అనుకుంటుందని అంటున్నారు. నంద్యాల లోక్ సభ టికెట్ కు బైరిరెడ్డి కూతురు బైరి రెడ్డి శబరి బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బైరిరెడ్డి శబరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆమెకు నంద్యాల ఎంపీ టికెట్ ఖాయమని రీసెంట్గా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ అధికారికంగా టికెట్ ను ప్రకటించాల్సి ఉంది. టికెట్ ఖాయమని త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో బైరిరెడ్డి అనుచరులు నరసింహ చౌరస్తా వద్ద మిఠాయిలు కూడా పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరం చేసుకున్నారు.
బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేశారు. టికెట్ కన్ఫర్మ్ కాకముందే ఇంత హడావిడి ఎందుకని ఓ వర్గం మండిపడింది. బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించిన నేత. సీమలో ఆయనకు మంచి పేరు ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయమని ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బైరిరెడ్డికి పాణ్యం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఆయన టికెట్ పై చంద్రబాబునాయుడు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ బైరి రెడ్డి అనుచరులు మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక ఆయన కూతురికి చివరికి ఏకంగా లోక్ సభ టికెట్ దక్కనిందని ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే ఆమెకు నంద్యాల ఎంపీ టికెట్ ను ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. స్థానిక రాజకీయ పరిస్థితులు సన్నిహితుల సంప్రదింపులు జరిపిన తర్వాత బైరిరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.