TDP Leader : త‌ల్లి వైసీపీకి ఓటు వేసింద‌ని క‌న్న‌త‌ల్లిని హ‌త్య చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP Leader : త‌ల్లి వైసీపీకి ఓటు వేసింద‌ని క‌న్న‌త‌ల్లిని హ‌త్య చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2024,12:30 pm

TDP Leader : మ‌నుషుల‌లో మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంది. చిన్న చిన్న కార‌ణాల‌తో చంపుకుంటుండ‌డం చూస్తుంటే ప్ర‌పంచం ఏటుపోతుందా అని అర్ధ‌మ‌వుతుంది. తాజాగా ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు దారుణంగా హతమర్చాడు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కంబదూరు మండలం ఎగువపల్లిలో తల్లిని సుత్తితో కొట్టి తనయుడు హతమార్చాడు.

TDP Leader మ‌రీ ఇంత క్రూరంగానా..!

తల్లి వైసీపీకి ఓటు వేయడంతో విచక్షణ మరిచిన కొడుకు కన్న తల్లినే సుత్తితో కొట్టి చంపేశాడు. ఓటు వేసినందుకు తల్లితో గొడవ పెట్టుకున్న తనయుడు మద్యం మత్తులో హత్య చేసి పరారయ్యాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డే వెంకటేశులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నాడు.వెంకటేశులు తల్లి సుంకమ్మ సోమవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేసినట్టు కొడుకుతో చెప్పింది. కోపంతో ఊగిపోయిన తనయుడు తల్లిని తీవ్రంగా దూషించాడు.

TDP Leader త‌ల్లి వైసీపీకి ఓటు వేసింద‌ని క‌న్న‌త‌ల్లిని హ‌త్య చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌

TDP Leader : త‌ల్లి వైసీపీకి ఓటు వేసింద‌ని క‌న్న‌త‌ల్లిని హ‌త్య చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌..!

ఆ తర్వాత మద్యం సేవించి ఇంటికి వచ్చి మళ్లీ తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లిపై దాడి చేశాడు. సుంకమ్మ తలపై ఇనుప సుత్తితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కొడుకే హత్య చేశాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కంబదూరు పోలీసులు హత్య ప్రాంతానికి చేరుకొని కేసునమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గ‌తంలో ఇలాంటి ఘట‌న‌లు చాలానే జ‌రిగిన కూడా ఇప్పుడు ఈ ఘ‌ట‌న మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది