TDP : మళ్లీ వైసీపీ గెలుపు ఈజీ చేస్తున్న తెలుగుదేశం అతిపెద్ద సెల్ఫ్ గోల్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : మళ్లీ వైసీపీ గెలుపు ఈజీ చేస్తున్న తెలుగుదేశం అతిపెద్ద సెల్ఫ్ గోల్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 July 2023,11:00 am

TDP : రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అలాగే.. రాజకీయాల్లో అనుభవం కూడా చాలా ముఖ్యం. అనుభవం లేకపోతే ఏం చేయలేం. అనుభవం అనేది చాలా కీలకం. రాజకీయ అనుభవం ఎంత ఎక్కువ ఉంటే.. రాజకీయాల్లో అంతగా రాణించగలరు. కానీ.. ఆ అనుభవం నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్లు ఏపీని బాగానే  పాలించింది కానీ.. 2019 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లాంటి వాటితో వాళ్ల కంట్లో వాళ్లే వేలు పెట్టుకొని పొడుచుకున్నారు. అలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి అరకు నియోజకవర్గం.

అరకు నియోజకవర్గం అనేది ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో ఎస్టీకి చెందిన నేత కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. ఆయన గెలిచింది వైసీపీ నుంచి. కానీ.. ఆ తర్వాత ఆయన టీడీపీ ప్రభుత్వం రావడంతో టీడీపీకి జై కొట్టారు. ఆ తర్వాతి క్రమంలో కిడారిని మావోయిస్టులు చంపేశారు. దీంతో ఆయన కొడుకు కిడారి శ్రవణ్ ను చేరదీసిన చంద్రబాబు.. మంత్రిని కూడా చేశావరు. 2019 ఎన్నికల్లో అదే అరకు నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఇచ్చారు. కానీ.. 2019 ఎన్నికల్లో సింపతీ వర్కవుట్ కాలేదు. శ్రవణ్ కుమార్ ఓడిపోయారు. డిపాజిట్ కూడా ఆయనకు దక్కలేదు.కిడారి శ్రవణ్ కుమార్ ఓడిపోవడానికి కారణం టీడీపీలోని ఆధిపత్య పోరే అంటున్నారు. తన సొంత తండ్రిని మావోయిస్టులు చంపడంతో ఆయనపై అక్కడి గిరిజనుల నుంచి సింపతీ వచ్చినా.. అదే గిరిజన జాతికి చెందిన సియ్యారి దొన్నుదొర టికెట్ కావాలని పట్టుబట్టి రచ్చ రచ్చ చేశారు.

TDP

TDP

TDP : దానికి కారణం.. టీడీపీలోని ఆధిపత్య పోరే

దీంతో చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టారు. అయినా కూడా పట్టువదలకుండా దున్ను దొర.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దాని వల్ల.. అక్కడ ఓట్లు చీలిపోయాయి. గిరిజనుల్లోనే చాలామందికి ఎవరికి ఓటు వేయాలో అర్థం కాలేదు. దాని వల్ల అరకులో ఓడిపోయే పరిస్థితి టీడీపికి వచ్చింది. ఇక.. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కూడా మళ్లీ కిడారి, సియ్యారి వర్గాలు టికెట్ కోసం పోటీ పడుతున్నాయి. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో చంద్రబాబుకు కూడా అర్థం కావడం లేదట. చూద్దాం ఏం జరుగుతుందో?

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది