Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గాలి మొత్తం తీసి పారేసిన అచ్చన్నాయుడు?
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది. అధికారంలోకి వచ్చేంత సీట్లు గెలుస్తుందా? అనేది డౌట్. ఒంటరిగానే పోటీ చేస్తుందా? లేక వేరే పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా? అనేదానిపై స్పష్టత లేదు. ఓవైపు టీడీపీ 175 సీట్లు, మరోవైపు వైసీపీ కూడా 175 సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేసింది. చంద్రబాబు ఎలా 175 సీట్లు గెలువబోతున్నాం అని అన్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. దానికి కారణం.. పొత్తులే అని, పొత్తులను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అలా వ్యాఖ్యానించి ఉంటారని చెబుతున్నారు.
అయితే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏం చెప్పారో తెలుసా? ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని అన్నారు. 160 సీట్లు టీడీపీనే గెలిస్తే ఇక మిగిలిన 15 సీట్లు ఎవరు గెలుస్తారు. ఆ మిగిలిన 15 సీట్లు జనసేన పార్టీ గెలుస్తుందనా అచ్చెన్నాయుడు ఉద్దేశం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్ కు ఇచ్చే సీట్లు 15 మాత్రమేనా. ఆ విషయాన్నే అచ్చెన్నాయుడు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan : జనసేనకు 15 సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ
చంద్రబాబు 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు మాత్రం 160 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అంటే.. చంద్రబాబు చెబుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ కు 15 సీట్లు మాత్రమే కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మన వాళ్లు ఉంటే ఖచ్చితంగా సీఎం సీటు అడగొచ్చు అని తన మీటింగులలో చెప్పుకొచ్చారు. అంటే కనీసం ఒక 40 సీట్లు కావాలని టీడీపీని జనసేన అడిగే అవకాశం ఉంది. అందులో 30 వరకు అయినా జనసేన పార్టీకి టీడీపీ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.