TDP : పొలిట్ బ్యూరో మీటింగ్‌లో ఎమ్మెల్యేలకి కీలక బాధ్యతలు.. చంద్రబాబు కొత్త టీం రెడీ అవుతుందా?
TDP : ఏపీలో కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ రోజు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ఏయే అంశాల గురించి చర్చ నడుస్తుంది అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించేఅవకాశముంది.
TDP : పొలిట్ బ్యూరో మీటింగ్‌లో ఎమ్మెల్యేలకి కీలక బాధ్యతలు.. చంద్రబాబు కొత్త టీం రెడీ అవుతుందా?
పార్టీ లో సంస్థాగత ఎన్నికలతో పాటుగా జాతీయ కమిటీలోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. దీని పైన ఇప్పటికే లోకేష్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మూడు సార్లు ఒకే పదవిలో కొనసాగుతున్న వారు తప్పుకుంటారని తేల్చి చెప్పారు. అందుతూ తనతో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారని స్పష్టత ఇచ్చారు. పార్టీ ఇచ్చే బాధ్యతలను స్వీకరిస్తానని చెబుతూ.. పరోక్షం గా తన భవిష్యత్ పదవి గురించి చెప్పే ప్రయత్నం చేసారు. యువనేతలకు స్థానం కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. దీనిపై కూడా నేడు చర్చించే అవకాశముంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుండటంతో పదవుల భర్తీపైనే ఎక్కువగా పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.
పార్టీలో కోటి మంది సభ్యత్వం.. సంస్థాగత ఎన్నికల పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ రూపొందించనున్నట్టు సమాచారం. ప్రభుత్వ పనితీరు.. మిత్రపక్షాలతో సమన్వయం గురించి చర్చ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలయ్యకు పోలిట్ బ్యూరో అభినందించనుంది. మిత్రపక్షాలతో సమన్వయం పైనా సీనియర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్య నేతలకు ఇక నుంచి ఇతర బాధ్యతలు కేటాయిస్తారని తెలుస్తోంది
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.