Chandrababu : లోకేశ్‌ను నమ్మని చంద్రబాబు.. అందుకే రాయలసీమ టూర్.. పవన్‌ని మాత్రం డిస్టర్బ్ చేయడం లేదు
Chandrababu : ప్రస్తుతం ఏపీలో టీడీపీ యాక్టివ్ లో ఉంది. కారణం.. కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే టీడీపీ నేతలు యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ చాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలను కోరుతున్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. అది కూడా ఆఖరి చాన్స్ అంటూ చంద్రబాబు ప్రజలను వేడుకుంటున్నారు. మరోవైపు తన కొడుకు నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. రాయలసీమలో ఆయన యాత్ర ముగిసింది.
కానీ.. లోకేష్ యాత్ర ముగిసినా ఎందుకో రాయలసీమ ప్రజలకు ఇంకా టీడీపీ మీద నమ్మకం రాలేదని చంద్రబాబుకు అర్థం అవుతోంది. చిత్తూరు జిల్లాలో తన పాదయాత్రను లోకేష్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. చాలా రోజులు రాయలసీమలోనే ఆయన పాదయాత్ర కొనసాగింది. ఆ తర్వాత కోస్తా ఆంధ్రా జిల్లాల్లోకి ఆయన యాత్ర ఎంట్రీ ఇచ్చింది. అయితే.. టీడీపీకి ఆయువుపట్టు అయిన రాయలసీమలో అనుకున్నంతగా లోకేశ్ బాబు యాత్రకు స్పందన రాలేదు. దీంతో చంద్రబాబు ఒకింత నిరాశకు గురయినట్టు తెలుస్తోంది. అందుకే.. మరోసారి తాను రంగంలోకి దిగి రాయలసీమ టూర్ చేపట్టాలని నిర్ణయించుకున్నారట.అయితే.. నారా లోకేష్ కడప జిల్లాలో చాలా హడావుడి చేశారు. కడప జిల్లాకు చెందిన రెడ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. చివరకు లోకేష్ తన పేరు చివర రెడ్డి తగిలించుకోవాలని చెప్పుకునేంత దాకా తీసుకెళ్లారు. ఆ హడావుడి అందరికీ తెలిసిందే.
Chandrababu : కడప జిల్లా రెడ్లతో సమావేశమే హైలెట్
అంతకుమించి ఆయన ఏ టూర్ కూడా హైలెట్ కాలేదు. అంతా సప్పగా నడిచింది. అందుకే.. చంద్రబాబు మళ్లీ రాయలసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ.. వెనువెంటనే చంద్రబాబు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందుకే గోదావరి జిల్లాల జోలికి చంద్రబాబు పోవడం లేదు. కానీ.. రాయలసీమ మీదనే చంద్రబాబు ఫోకస్ మొత్తం పెట్టారు. చూద్దాం మరి రాయలసీమ ప్రజలు టీడీపీని ఈసారైనా ఆదరిస్తారో లేదో?